క్షీణించిన ఆరోగ్యం.. ఐసీయూలో ఆరోగ్యశాఖ మంత్రి
By తోట వంశీ కుమార్ Published on 19 Jun 2020 6:05 PM ISTకరోనాతో బాధపడుతున్న ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారింది. ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడంతో ఆయన్ను మరో ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు వెల్లడించారు. కరోనా లక్షణాలతో మూడు రోజుల క్రితం ఢిల్లిలోని రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటి ఆస్పత్రిలో చేరారు సత్యేందర్ జైన్. రెండు రోజులుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురుకావడంతో ఆక్సిజన్ అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోంది.
మంగళవారం నిర్వహించిన ఫలితాల్లో నెగెలిట్ రాగా.. బుధవారం మరోసారి చేసిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని మంత్రే స్వయంగా ట్విట్టర్‌లో వెల్లడించారు. సత్యేందర్ జైన్ పరిస్థితి మరింత క్షీణించిందని, అతన్ని రాజధానిలోని సాకేత్ మాక్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయనకు ఫ్లాస్మా చికిత్సకోసం ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. సత్యేందర్ జైన్ అనారోగ్యంతో బాదపడుతుండడంతో ఆయన బాధ్యతలను డిప్యూటీ సీఎం సిసోడియాకు అప్పగించారు.
సత్యేందర్ జైన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. కరోనాతో పోరాడుతున్న ఢిల్లీ ఆరోగ్యమంత్రి సత్యేంద్ర జైన్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానంటూ ట్వీట్ చేశారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్ సలహాదారు అక్షయ్ మరాఠే, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సలహాదారు అభినండిత మాథుర్ లకు కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది.