గుడ్‌ న్యూస్‌.. భారత్‌లో 2లక్షల మంది కోలుకున్నారు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 Jun 2020 4:43 AM GMT
గుడ్‌ న్యూస్‌.. భారత్‌లో 2లక్షల మంది కోలుకున్నారు

భారత్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో 13,586 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ కాగా.. 336 మంది మరణించినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా బులిటెన్‌లో వెల్లడించింది. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటికి ఒక్క రోజు వ్యవధిలో ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. వీటితో కలిపి ఇప్పటి వరకు దేశంలో 3,80,532 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 12,573 మంది ప్రాణాలు కోల్పోయారు.

మొత్తం నమోదైన కేసుల్లో 2,04,710 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగా.. 1,63,248 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అత్యధిక కేసులు నమోదు అవుతున్న దేశాల్లో భారత్‌ 4వ స్థానంలో ఉంది. ఇక మరణాలు అత్యధికంగా నమోదు అవుతున్న దేశాల్లో భారత్‌ ఎనిమిదవ స్థానానికి చేరుకుంది. దేశంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతుండడం కాస్త ఊరటనిస్తుంది. ఇక రికవరీ రేటు 52.5శాతంగా ఉండగా.. మరణాల రేటు 3.3శాతంగా ఉంది.

Next Story
Share it