పవన్ కల్యాణ్‌పై ఏపీ మంత్రి అనిల్ ఫైర్...
By Newsmeter.Network Published on 2 Dec 2019 7:51 PM ISTఏపీ రాష్ట్ర నీటిపారుదల శాఖమంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మంచి పాలన అందించే దిశగా జగన్పాలన కొనసాగుతుంటే, ఓర్వలేక ప్రతిపక్షాలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయని దుయ్యబట్టారు.ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ పవన్ కల్యాణ్‌ను ఏమని పిలవాలో అర్ధం కావడంలేదని, ప్రతి పక్షనేత అందామనుకుంటే కేవలం ఆయన పార్టీకి ఒక సీటు వచ్చింది... అదే సినీ నటుడు అందమనుకుంటే సినిమాలు ఆపేశాడు....పుస్తకాలు చదివాను అని చెబుతుంటాడనుకుంటే మేధావి అనుకుంటే అజ్ఞానిగా కనిపిస్తున్నాడంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు ఏడైరక్షన్ ఇస్తే అది పవన్ కల్యాణ్ ఫాలో అవుతున్నాడని ఆరోపించారు. రాష్ట్ర్ర ప్రజలందరూ కూడా పవన్ నాయుడు కల్యాణ్ నాయుడు అని నామకరణం చేశారని, నిన్న రైల్వేకోడూరు వెళ్లి ఏదోదే మాట్లాడుతున్నాడని, ఇప్పటికే ప్రతిపక్షనేత చంద్రబాబు మతిస్ధిమితం కోల్పోయి ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదని అన్నారు. జగన్‌ను విమర్శించే దమ్ము, ధైర్యం ఎవరికి లేదన్నారు.
సోనియాగాంధీని ఎదిరించినప్పటి నుంచి జగన్ దమ్ము, ధైర్యం గురించి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని, పవన్ కల్యాణ్ చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. 2014లో ప్రశ్నిస్తానని చెప్పి ఎవరిని ప్రశ్నించకుండా ఆరోజు అధికారపార్టీకి తొత్తుగా వ్యవహరించిన పవన్.. ఇప్పుడు మాట్లాడే హక్కులేదన్నారు. నేను జగన్ రెడ్డి అని పిలుస్తాను అంటాడు. చంద్రబాబు చెప్పినట్లు పదే పదే కేవలం జగన్ మోహన్ రెడ్డి కులాన్ని ప్రస్తావించడం, వక్రీకరించడం తప్ప మరొకటి లేదని మండిపడ్డారు. పవన్ కల్యాణ్ మాట్లాడిన భాషచూస్తే ఆశ్చర్యమేస్తోందన్నారు. రాయలసీమలో బీడు పొలాలు ఉన్నాయంటూ, నాయకుల పొలాలు పచ్చగా ఉన్నాయని అంటున్నపవన్ కల్యాణ్ మాట్లాల్లో ఏమైన అర్థం ఉందా అంటూ ఎద్దేవా చేశారు అనిల్.
రాష్ట్రానికి జగన్ ముఖ్యమంత్రి కావడం వల్ల రాయలసీమ ప్రాంతం సస్యశామలంగాఉందని, దానిని జీర్ణించుకోలేక కడుపుమంటతో పవన్ కల్యాణ్ అలా మాట్లాడుతున్నారన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక సీమకు సంబంధించి అనేక ప్రాజెక్ట్ లు డిజైన్ చేసి గతంలో ఏదైతో కరవుతో అల్లాడారో...దానిని అధిగమించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. పవన్ కల్యాణ్ కులాలను,మతాలను,ప్రాంతాలను వేరు చేసి మాట్లాడేతీరు సరికాదంటే ...నాకు కులాలు, మతాలు లేవని అంటాడని, ఇలా వేరు చేసి మాట్లాడే వ్యక్తిని నాయకుడు అనాలా .... లేక యాక్టర్ అనాలా, ఆయన ఎక్కడ మాట్లాడినా.. అర్థం, పర్థం లేని విధంగా మాట్లాడుతుంటాడని ఆరోపించారు.
కర్నూలులో 2017లో ఓ స్కూల్ యాజమాన్యంకు, ఓ పాపకు సంబంధించి జరిగిన సంఘటన గురించి పవన్ నాయుడు మాట్లాడాడని, అదేదో జగన్ కు సంబంధించింది అయినట్లు,ఈ ప్రభుత్వంలో జరిగినట్లు, ఆ దోషులందరిని కాపాడాడన్నట్లు మాట్లాడటం సరికాదన్నారు. ముందు మాట్లాడే విధానం నేర్చుకోవాలని మంత్రి హితవు పలికారు. జగన్ పాలనలో అతి తక్కువ హయంలోరాష్ట్రం అభివృద్ధి చెందడాన్ని ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని అన్నారు.