శ్మ‌శానంలో కుళ్లిన అర‌టి పండ్లు.. ఎగ‌బ‌డ్డ వ‌ల‌స కార్మికులు..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 April 2020 6:32 AM GMT
శ్మ‌శానంలో కుళ్లిన అర‌టి పండ్లు.. ఎగ‌బ‌డ్డ వ‌ల‌స కార్మికులు..

ఇంటికి వెళ‌దామంటే వెళ్ల‌లేని పరిస్థితి. తిందాం అంటే తిండి కూడా స‌రిగ్గా దొర‌క‌డం లేదు. ఆక‌లి బాధ‌తో ఏం చేయాలో అర్థం కావ‌డం లేదు వ‌ల‌స కూలీల‌కి. ఓ చోట అర‌టి పండ్లు కుప్పలు గా క‌నిపించాయి. ఇంకేముంది అక్క‌డికి ఎగబ‌డ్డారు. దారుణం ఎందంటే.. అవి..కుళ్లీన పోయిన అర‌టి పండ్లు. పైగా అవి శ్మ‌శానంలో ఉన్నాయి.

అర‌టి పండ్లు కుళ్లీ పోవ‌డంతో ఎవ‌రో ఢిల్లీలోని నిగంబోధ్ ఘాట్ శ‌శ్మాన వాటిక‌లో పార‌బోయారు. ఈ విష‌యం తెలిసిన వ‌ల‌స కార్మికులు అక్క‌డికి వెళ్లారు. తిండి, నీళ్లు లేక అల‌మ‌టిస్తున్న వాళ్లు వెంట‌నే.. వాటిల్లోంచి మంచివి ఏరుకుని తిన్నారు. కొంద‌రు వాటిని బ్యాగులో నింపుకున్నారు. లాక్‌డౌన్ వ‌ల్ల ప‌ని దొర‌క‌డం లేదు. పోని స్వంత ఊరికి వెళ్ల‌డానికి వీలులేదు. తిన‌డానికి తిండి కూడా దొర‌క‌డం లేదు.ఇలాంటి ప‌రిస్థితిలో మాకు అర‌టి పండ్లు క‌నిపించాయి. ఇంకేం ఆలోచించ‌లేదు. వాటిల్లోంచి మంచివి తీసుకున్నాం. మాకు భోజ‌నం దొర‌క‌ని రోజు వీటితో క‌డుపు నింపుకోవాలి. అందుకనే వాటిని తీసుకెలుతున్నాన‌ని ఓ వ‌ల‌స‌కార్మికుడు చెప్పాడు. ఆ కార్మికుడు చెప్పిన మాట‌లు వారీ దీన స్థితికి అద్దం ప‌డుతున్నాయి.

Next Story