రైతులకు వాతావరణ శాఖ శుభవార్త
By సుభాష్Published on : 16 April 2020 11:51 AM IST

రైతులకు వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. ఈ ఏడాది వర్షాలు సాధారణంగానే ఉంటాయని తెలిపింది. జూన్ 1 నాటికి నైరుతి రుతుపవనాలు కేరళ రాష్ట్రాన్ని తాకనున్నట్లు పేర్కొంది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలపై మొదటి సారిగా భారత వాతావరణ శాఖ స్పందించింది. జూన్ 4 నాటికి చెన్నై, జూన్ 8 నాటికి హైదరాబాద్, 10 నాటికి పుణే, 11 నాటికి ముంబై, అలాగే జూన్ 27వ తేదీ నాటికి దేశ రాజధాని అయిన ఢిల్లీకి చేరే అవకాశాలున్నాయని తెలిపింది.
Also Read
సినిమా థియేటర్ హౌస్ఫుల్ఒక విధంగా చెప్పాలంటే మనకు శుభపరిణామమేనని చెప్పాలి. వ్యవసాయ రంగానికి దోహదం చేస్తుంది. పంటలు బాగా పండడమే కాకుండా ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు.
Next Story