జూనియర్, డిగ్రీ కళాశాలల విద్యార్థులకు మధ్యాహ్నభోజన పథకం: కేసీఆర్
By సుభాష్ Published on 17 July 2020 3:20 PM ISTతెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విద్యాసంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఉదయం కళాశాలలకు వచ్చిన విద్యార్థులు మధ్యాహ్నానికి మళ్లీ వెళ్లిపోతున్నారని, దీని వల్ల ప్రభుత్వ కళాశాలల్లో డ్రాపవుట్స్ పెరిగిపోతున్నాయని అన్నారు. దీనిని నివారించేందుకు విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అందించనున్నట్లు కేసీఆర్ చెప్పారు.
అలాగే జడ్చర్ల డిగ్రీ కళాశాల లెక్చరర్ రఘురామ్ తన సొంత ఖర్చులతో విద్యార్థులకు మధ్యాహ్నభోజనం అందిస్తున్నారని, ఈ సందర్భంగా రఘురామ్‌ను సీఎం కేసీఆర్ అభినందించారు. ఈ నేపథ్యంలో కళాశాలల్లో భోజనం పెట్టాల్సిన అవసరం ఉందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. అలాగే రఘురామ్ విజ్ఞప్తి మేరకు జడ్చర్ల ప్రభుత్వ కళాశాలకు నూతన భవనాన్ని మంజూరు చేశారు.