ఎంతో మంచి పని చేస్తున్న మాజీ పోర్న్ స్టార్ మియా ఖలీఫా

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  14 Aug 2020 1:59 PM IST
ఎంతో మంచి పని చేస్తున్న మాజీ పోర్న్ స్టార్ మియా ఖలీఫా

మియా ఖలీఫా.. మాజీ పోర్న్ స్టార్..! ఇప్పుడు లెబనాన్ ను ఆదుకోవాలని తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. ఆగష్టు 4న లెబనాన్ లో భారీ విధ్వంసం చోటు చేసుకున్న ఘటన తెలిసిందే..! లెబనాన్ వాసులు తీవ్రంగా నష్టపోయారు.

వారిని ఆడుకోడానికి మాజీ పోర్న్ స్టార్, మోడల్ మియా ఖలీఫా డొనేషన్లు చేయడానికి ముందుకు వచ్చింది. మియా ఖలీఫాకు తనకు ఎంతో పేరు తీసుకుని వచ్చిన అద్దాలను వేలానికి పెట్టింది. ఒక లక్ష డాలర్లకు బిడ్డింగ్ వేసిన మియా ఖలీఫా.. ఆ డబ్బు మొత్తాన్ని లెబనాన్ రెడ్ క్రాస్ కు ఇవ్వాలని అనుకుంటోంది.

ముందు తన అద్దాలను 10వేల డాలర్లకు ఇచ్చేయాలని అనుకుంది. ఆమె ఫాలోవర్లు పెద్ద ఎత్తున పోటీ పడడంతో లక్ష డాలర్లకు బిడ్ ను పెంచేసింది. 'ఈబే' సైట్ లో ఆమె వేలం వేస్తున్నట్లుగా ప్రకటించింది. రెండు లక్షల డాలర్లకు వెళ్లే అవకాశం ఉందని చెబుతూ ఉన్నారు.

లెబనాన్ కు చెందిన రాజకీయనాయకులు ఏమీ చేయకున్నా ఒక మాజీ పోర్న్ స్టార్ అక్కడి వాళ్ళను ఆదుకోవాలని అనుకోవడం నిజంగా అభినందించదగ్గ విషయమని పలువురు అంటున్నారు. లెబనీస్ ప్రెసిడెంట్ మీద కూడా మియా ఖలీఫా సామాజిక మాధ్యమాల్లో విమర్శలను గుప్పించింది. చివరికి లెబనీస్ ప్రెసిడెంట్ ఆమె ఇంస్టాగ్రామ్ అకౌంట్ ను బ్లాక్ చేశాడు.

లెబనాన్ రాజధాని బీరూట్ విధ్వంసం కారణంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తడంతో ముగ్గురు మంత్రులు రాజీనామా చేయడంతో తాను కూడా రాజీనామా చేయాలని ప్రధాని హసన్‌ నిర్ణయించుని తన రాజీనామాను సమర్పించారు. ‘ప్రభుత్వం కన్నా అవినీతి శక్తిమంతమైందని తేలిందని.. ప్రజలతో కలిసి మార్పుకోసం పోరాడుతాను.. ఈ రోజు నా ప్రభుత్వం రాజీనామా చేస్తోంది.. దేవుడే లెబనాన్ ను రక్షించాలి’ అని ఆయన అన్నారు.

బీరూట్ షిప్ యార్డ్ లోని అమ్మోనియం నైట్రేట్ నిల్వల వలన భారీ ప్రమాదం పొంచి ఉందని ప్రభుత్వాన్ని నెల క్రితమే హెచ్చరించినా కనీసం అటువైపుగా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. పోర్టులో ఉన్న 2,750 టన్నుల అమ్మోనియం నైట్రేట్‌ నిల్వల వల్ల రాజధాని బీరుట్‌కు ప్రమాదం పొంచి ఉందని సెక్యురిటీ వర్గాలు నెల క్రితమే హెచ్చరించాయి. సెక్యురిటీ వర్గాల హెచ్చరికలకు సంబంధించిన పత్రాలను కొందరు సీనియర్‌ భద్రతా అధికారులు పరిశీలించినప్పటికీ ఎటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకోకపోవడంతో ఆ దేశ ప్రజలు ఎంతో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Next Story