హైదరాబాద్‌: సుధీర్ఘ కాలంగా ప్రజలకు సేవలందించిన పలు బ్యాంక్‌లు నేటి నుంచి కనుమరుగుకానున్నాయి. ప్రభుత్వ రంగంలోని పది బ్యాంకుల భారీ విలీనం నేటి నుంచి అమల్లోకి రానుంది. దీంతో ఆంధ్రా బ్యాంక్‌ సహా ఆరు బ్యాంక్‌లు విలీనం కానున్నాయి. ఆలహాబాద్‌ బ్యాంక్‌, కార్పొరేషన్‌ బ్యాంక్‌, సిండికేట్‌ బ్యాంక్‌, ఓరియంటల్‌ బ్యాక్‌ ఆఫ్‌ కామర్స్‌, యునైటెడ్‌ బ్యాంక్‌లు ఇక కనిపించవు. దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో బ్యాంకుల విలీనం ప్రాధాన్యతను సంతరించుకుంది.

అయితే ప్రస్తుత పరిస్థితుల్లో బ్యాంకుల విలీన ప్రక్రియ అంత సజావుగగా జరగకపోవచ్చునుని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే బ్యాంక్‌ల చీఫ్‌లు మాత్రం ఎలాంటి సమస్యలు ఉండబోవని చెబుతున్నారు.

అంతర్జాతీయ స్థాయిలో పోటీపడగలిగే భారీ బ్యాంకులను ఏర్పాటు చేయాలన్న కేంద్రం లక్ష్యంతోనే.. ఈ బ్యాంకుల విలీనానికి తెరతీసిన విషయం తెలిసిందే.

కెనరా బ్యాంక్‌, సిండికేట్‌ బ్యాంక్‌లు ఇకపై కెనరా బ్యాంక్‌గా పని చేస్తాయి. అలాగే ఇండియన్‌ బ్ఆయంక్‌, అలహాబాద్‌ బ్యాంక్‌లు విలీనమై ఇండియన్‌ బ్యాంక్‌గా పని చేస్తాయి. యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఆంధ్రాబ్యాంక్‌, కార్పొరేషన్‌ బ్యాంక్‌లు కలిసి యూనియన్‌ బ్యాంక్‌గా కనిపిస్తాయి. పంజాబ్‌ నేషన్‌ బ్యాంక్‌, ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌, యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌, ఇండియా మూడు బ్యాంకుల స్థానంలో పంజాబ్‌ నేషన్‌ బ్యాంక్‌గా పని చేస్తుంది.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.