హైదరాబాద్‌: మేడ్చల్‌లో భారీ అగ్నిప్రమాదం

By సుభాష్  Published on  5 May 2020 8:33 AM IST
హైదరాబాద్‌: మేడ్చల్‌లో భారీ అగ్నిప్రమాదం

మేడ్చల్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పారిశ్రామిక వాడలోఈ అగ్ని ప్రమాదం సంభవించింది. పవన్‌ కెమికల్‌ కంపెనీలో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దీంతో రసాయన గోదాం పూర్తిగా దగ్ధమైంది. పక్కనే ఉన్న విక్టరీ ఎలక్ట్రికల్‌కు మంటలు భారీగా వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

ఈ ప్రమాదంలో సుమారు రూ.20 లక్షల వరకు ఆస్తినష్టం జరిగినట్ల అంచనా వేస్తున్నారు. భారీగా మంటలు ఎగిసి పడటంతో పరిసర ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు.

Next Story