Fact Check : రెండో ప్రపంచ యుద్ధం సమయంలో సైనికులకు అఖండ భారతావని ఉన్న మెడల్స్ ను ఇచ్చారా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  21 Aug 2020 1:09 PM GMT
Fact Check : రెండో ప్రపంచ యుద్ధం సమయంలో సైనికులకు అఖండ భారతావని ఉన్న మెడల్స్ ను ఇచ్చారా..?

రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న సైనికులకు అఖండ భారతావని ఉన్న మెడల్స్ ను ఇచ్చినట్లుగా పలువురు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ ఉన్నారు. ఓ మెడల్ ఆ మెడల్ మీద అఖండ భారతం ఉంది.. 1939-45 అంటూ సంవత్సరం కూడా ఉంది.

స్వాతంత్య్రానికి ముందు ఇచ్చిన మెడల్ అంటూ పలువురు వీటిని తమ తమ అకౌంట్లలో షేర్ చేస్తున్నారు.

నిజ నిర్ధారణ:

1939-45(రెండో ప్రపంచ యుద్ధం) సమయంలో సైనికులకు ఇచ్చిన మెడల్స్ అంటూ చెబుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు. ఈ మెడల్స్ ను ఆర్మీలో నాన్-ఆపరేషనల్ సర్వీసులు అందించిన బ్రిటీష్ ఇండియన్ సైనికులకు ఇచ్చారు. రెండో ప్రపంచ యుద్ధంలో పాలుపంచుకున్న వారికి ఈ మెడల్ ఇచ్చారన్నది 'అబద్ధం'.

ఈ ఫోటోను గూగుల్ లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా పాత కాయిన్స్ ను అమ్మే వెబ్ సైట్ అయిన Coinbazzar.com లోనూ.. Waterloo-collection.ru అనే యాంటిక్ స్టోర్ లోనూ లభించింది.

Coinbazzar.com లో ఈ మెడల్ ను అమ్మకానికి పెట్టారు. అందులో “British India World War 2 India Undivided full map Defence medal” బ్రిటీష్ ఇండియా వరల్డ్ వార్ 2 ఇండియా, అఖండభారతం డిఫెన్స్ మెడల్ అని చెప్పుకొచ్చారు.

“British India Defence medal” అంటూ గూగుల్ లో వెతకగా పలు వెబ్ సైట్లలో ఇందుకు సంబంధించిన సమాచారం లభించింది. సెప్టెంబర్-3, 1939 నుండి సెప్టెంబర్-2, 1945 మధ్య కనీసం మూడు సంవత్సరాల పాటూ నాన్-ఆపరేషనల్ సర్వీసులు అందించిన వారికి ఈ మెడల్ ను ఇచ్చారు. అలాగే వార్ మెడల్ తో పాటూ పలు క్యాంపెయిన్ స్టార్స్ ను కూడా ఇచ్చారు. ఇండియన్ ఎంపైర్ కు చెందిన రిబ్బన్ ను కూడా అందించారు.

ఈ మెడల్ ను బ్రిటీష్, ఇండియన్ ఆఫీసర్లకు, వారెంట్ ఆఫీసర్లకు, ఇండియన్ ఫోర్సెస్, ఇండియన్ సివిల్ డిఫెన్స్ సర్వీసుల్లో వివిధ ర్యాంకుల్లో ఉన్న అధికారులకు ఇచ్చారు. డిఫెన్స్ మెడల్ కు క్వాలిఫై అయిన వ్యక్తులకు ఈ మెడల్ ఇవ్వలేదు. మిలిటరీ కొలువుల్లో ఉన్న వాళ్ళు, ఎమర్జెన్సీ కమీషన్డ్ ఆఫీసర్స్ లాంటి నాన్-కాంబాట్ సేవలను అందించిన వారికి ఈ అవార్డు లభించింది.

మూడేళ్ళ పాటూ నాన్ ఆపరేషనల్ సర్వీసును అందించిన బ్రిటీష్, ఇండియన్ ఆఫీసర్లకు ఈ మెడల్స్ ను ఇచ్చారు. యుద్ధ వీరులకు ఈ పతకాన్ని ఇచ్చినట్లుగా జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి నిజం లేదు.

Next Story