Fact Check : రెండో ప్రపంచ యుద్ధం సమయంలో సైనికులకు అఖండ భారతావని ఉన్న మెడల్స్ ను ఇచ్చారా..?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 21 Aug 2020 6:39 PM IST![Fact Check : రెండో ప్రపంచ యుద్ధం సమయంలో సైనికులకు అఖండ భారతావని ఉన్న మెడల్స్ ను ఇచ్చారా..? Fact Check : రెండో ప్రపంచ యుద్ధం సమయంలో సైనికులకు అఖండ భారతావని ఉన్న మెడల్స్ ను ఇచ్చారా..?](https://telugu.newsmeter.in/wp-content/uploads/2020/08/Medals-with-undivided-map-of-India.jpg)
రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న సైనికులకు అఖండ భారతావని ఉన్న మెడల్స్ ను ఇచ్చినట్లుగా పలువురు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ ఉన్నారు. ఓ మెడల్ ఆ మెడల్ మీద అఖండ భారతం ఉంది.. 1939-45 అంటూ సంవత్సరం కూడా ఉంది.
స్వాతంత్య్రానికి ముందు ఇచ్చిన మెడల్ అంటూ పలువురు వీటిని తమ తమ అకౌంట్లలో షేర్ చేస్తున్నారు.
Medal of the time of World War II, which depicts India before independence.
Akhand Bharat pic.twitter.com/6RSOI8EUtO
— Sumanta Maiti (@SumantaMaiti2) August 12, 2020
World War II Medal. Greater India pic.twitter.com/x2nlN4OSBL
— Aviator Anil Chopra (@Chopsyturvey) August 13, 2020
నిజ నిర్ధారణ:
1939-45(రెండో ప్రపంచ యుద్ధం) సమయంలో సైనికులకు ఇచ్చిన మెడల్స్ అంటూ చెబుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు. ఈ మెడల్స్ ను ఆర్మీలో నాన్-ఆపరేషనల్ సర్వీసులు అందించిన బ్రిటీష్ ఇండియన్ సైనికులకు ఇచ్చారు. రెండో ప్రపంచ యుద్ధంలో పాలుపంచుకున్న వారికి ఈ మెడల్ ఇచ్చారన్నది 'అబద్ధం'.
ఈ ఫోటోను గూగుల్ లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా పాత కాయిన్స్ ను అమ్మే వెబ్ సైట్ అయిన Coinbazzar.com లోనూ.. Waterloo-collection.ru అనే యాంటిక్ స్టోర్ లోనూ లభించింది.
Coinbazzar.com లో ఈ మెడల్ ను అమ్మకానికి పెట్టారు. అందులో “British India World War 2 India Undivided full map Defence medal” బ్రిటీష్ ఇండియా వరల్డ్ వార్ 2 ఇండియా, అఖండభారతం డిఫెన్స్ మెడల్ అని చెప్పుకొచ్చారు.
“British India Defence medal” అంటూ గూగుల్ లో వెతకగా పలు వెబ్ సైట్లలో ఇందుకు సంబంధించిన సమాచారం లభించింది. సెప్టెంబర్-3, 1939 నుండి సెప్టెంబర్-2, 1945 మధ్య కనీసం మూడు సంవత్సరాల పాటూ నాన్-ఆపరేషనల్ సర్వీసులు అందించిన వారికి ఈ మెడల్ ను ఇచ్చారు. అలాగే వార్ మెడల్ తో పాటూ పలు క్యాంపెయిన్ స్టార్స్ ను కూడా ఇచ్చారు. ఇండియన్ ఎంపైర్ కు చెందిన రిబ్బన్ ను కూడా అందించారు.
ఈ మెడల్ ను బ్రిటీష్, ఇండియన్ ఆఫీసర్లకు, వారెంట్ ఆఫీసర్లకు, ఇండియన్ ఫోర్సెస్, ఇండియన్ సివిల్ డిఫెన్స్ సర్వీసుల్లో వివిధ ర్యాంకుల్లో ఉన్న అధికారులకు ఇచ్చారు. డిఫెన్స్ మెడల్ కు క్వాలిఫై అయిన వ్యక్తులకు ఈ మెడల్ ఇవ్వలేదు. మిలిటరీ కొలువుల్లో ఉన్న వాళ్ళు, ఎమర్జెన్సీ కమీషన్డ్ ఆఫీసర్స్ లాంటి నాన్-కాంబాట్ సేవలను అందించిన వారికి ఈ అవార్డు లభించింది.
మూడేళ్ళ పాటూ నాన్ ఆపరేషనల్ సర్వీసును అందించిన బ్రిటీష్, ఇండియన్ ఆఫీసర్లకు ఈ మెడల్స్ ను ఇచ్చారు. యుద్ధ వీరులకు ఈ పతకాన్ని ఇచ్చినట్లుగా జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి నిజం లేదు.