గుజరాత్‌లో భారీ అగ్నిప్రమాదం..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 Aug 2020 10:29 AM GMT
గుజరాత్‌లో భారీ అగ్నిప్రమాదం..

గుజరాజ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. వల్సద్‌ జిల్లా వాపి నగరంలోని ఓ కెమికల్‌ ఫ్యాక్టరీలో శనివారం మధ్యాహ్నాం ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. రసాయన పరిశ్రమ కావడంతో ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. స్థానికులు భయాందోళనకు గురైయ్యారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే 8 ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఆస్తి నష్ట, ప్రాణ నష్టం ఎంత జరిగింది, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.Next Story
Share it