కరోనా ఎఫెక్ట్: తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం
By సుభాష్ Published on 10 April 2020 10:15 AM GMTదేశ వ్యాప్తంగా కరోనా వైరస్ రోజురోజుకు వ్యాపిస్తోంది. ఇక దేశంలోని కరోనాను కట్టడి చేయడానికి కేంద్రం పిలుపుతో అన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఇక తెలంగాణలో కూడా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎవరైనా బయటకు రావాలంటే ప్రతీ ఒక్కరికి మాస్కులు తప్పని సరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మాస్కులు లేకుండా రోడ్లపై కనిపిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు సైతం మాస్కులు తప్పని సరిగ్గా ధరించాలని సూచించింది. ఇక ఇళ్లల్లో తయారు చేసే మాస్కులకు ప్రభుత్వం అనుమతి ఇస్తున్నట్లు పేర్కొంది. రోడ్లపై ఉమ్మివేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని గురువారం నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే మొదట్లో కరోనా కట్టడి అవుతుందనుకున్న తరుణంలో ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ ప్రార్థనల నేపథ్యంలో ఒక్కసారిగా కరోనా కేసుల సంఖ్య పెరిగిపోయాయి. మరణాల సంఖ్య కూడా కాస్త పెరిగింది. దీంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాలో కరోనా చాపకింద నీరులా వ్యాపించింది. ఇక హైదరాబాద్‌లో కూడా భారీగా కరోనా కేసులు నమోదువుతున్నాయి. హైదరాబాద్ తర్వాత నిజామాబాద్ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగా నమోదువున్నాయి. హైదరాబాద్ నగరంలో ఇది వరకు 15 కంటోన్మెంట్ క్లస్టర్లుగా ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం.