కరోనా వైరస్ దేశ వ్యాప్తంగా విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దీంతో వైద్యులు, సిబ్బంది ఎంతో శ్రమిస్తున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రోగులకు చికిత్సలు అందిస్తున్నారు. దీంతో హర్యానా ప్రభుత్వం వైద్యులకు, నర్సులకు, మెడికల్ సిబ్బందికి శుభవార్త చెప్పింది. కరోనా ప్రాణాలు లెక్క చేయకుండా పోరాడుతున్న వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, అంబులెన్స్ సిబ్బంది, రక్త పరీక్షలు చేసి సిబ్బందిలకు రెట్టింపు జీతాలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

కరోనాపై వైద్య సిబ్బంది ఎంతో పోరాడుతున్నారని, కుటుంబ సభ్యులతో గడపకుండా రోగుల కోసం ఎంతో శ్రమిస్తున్నారని, అందుకు వేతనాలు రెట్టింపు చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది.

అంతేకాదు కేంద్ర ప్రకటించిన కొత్త ఇన్సూరెన్స్ పరిధిలోకి రాని వైద్యులు, నర్సులు, పారామెడికల్, ఇతర సిబ్బంది వరుసగా రూ. 50 లక్షలు, రూ.30 లక్షలు, 20 లక్షలు, రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా లభిస్తాయని సీఎం ప్రకటించిన విషయం తెలిసిందే.

 

 

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.