అమృతకు షాకిచ్చిన తల్లి, బాబాయ్
By అంజి Published on 9 March 2020 9:37 AM IST
తన తండ్రి మారుతీరావు మృతదేహాన్ని చూసేందుకు ప్రయత్నించిన అమృతకు తల్లి గిరిజ, బాబాయ్ శ్రవణ్‌లు షాకిచ్చారు. అమృత తండ్రి మారుతీరావు ఆదివారం ఉదయం ఖైరతాబాద్‌లోని ఆర్యవైశ్య సంఘం భవనంలో ఆత్మహత్య చేసుకున్నాడు. నన్ను క్షమించు గిరిజా.. అమృత అమ్మ వద్దకు వెళ్లు అంటూ ఓ లేఖను రాశారు. కాగా మారుతీరావు మృతిపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. కూతురిపై బెంగపెట్టుకొనే ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తున్నప్పటికీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మారుతీరావు మృతికి కారణాలు ఏమై ఉంటాయి.. ఆస్తి తగాదాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు మారుతీరావు కుటుంబ సభ్యులు మాత్రం పోలీసుల వేదింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే మారుతీరావు మృతదేహాన్ని ఆదివారం పోస్టుమార్టం నిర్వహించి తన స్వగ్రామమైన మిర్యాలగూడ తరలించారు. మిర్యాలగూడలోని హిందూ స్మశాన వాటిక(షాబునగర్)లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
Also Read:
మారుతీరావు మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి.. తొలగని అనుమానాలు..!
10గంటలకు మారుతీరావు అంతిమయాత్ర ప్రారంభం కానుంది. అంతమయాత్రలో ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు తన తండ్రిని చివరిచూపు చూసుకుంటానని, తనను అందుకు అనుమతించాలని, తనకు భద్రత కల్పించాలని అమృత పోలీసులను కోరింది. కానీ తల్లి గిరిజ, బాబాయ్ శ్రవణ్, కుటుంబ సభ్యులు మాత్రం అందుకు అంగీకరించలేదు. అమృతను ఎట్టిపరిస్థితుల్లోనూ మారతీరావును చివరిచూపు చూసుకొనేందుకు అనుమతించమని ఖరాఖండీగా చెప్పారు. దీంతో పోలీసులుసైతం అమృతకు తాము భద్రత కల్పించలేమని చెప్పినట్లు తెలుస్తుంది.