నెల్లూరు జిల్లాలోని కుంకుమపూడి గ్రామంలో లంబయ్య అనే వ్యక్తిని మావోయిస్టులు పోలిసు ఇంఫార్మర్ గా భావించి చంపేసారు. పెద్దపాడు కు చెందిన తాంబేలు లంబయ్య సుమారు పది సంవత్సరాలు మావోయిస్ట్ గా పని చేసాడు, 2016 లో పోలీసులు అతనిని అరెస్ట్ చేసి 2 సంవత్సరాలు జైలులో ఉంచారు.

తరువాత విడుదల అయిన లంబయ్య తమ ఊరిలోనే ఉంటున్నాడు.

అయితే, మంగళవారం, అక్టోబర్ 22, 2019 రోజున అతనిని పట్టుకొని మావోఇస్టులు కుంకుమపుడి గ్రామం వద్ద చంపేసారు.

వారంలో ఇది మావోయిస్టులు చేసిన రెండో హత్య, అక్టోబర్ 20 న కొర్రా రంగా రావు అనే మాజీ మావోయిస్ట్ ని కూడా పోలీసు ఇంఫార్మర్ గా ముద్రించి చంపేసారు.

సత్య ప్రియ బి.ఎన్