హైదరాబాద్: మంచు మనోజ్ దంపతులు వీడాకులు తీసుకున్నారు. అదికారికంగా మంచు మనోజ్, ప్రణీతి రెడ్డి విడిపోయారు. ఈ విషయాన్ని మంచు మనోజ్ ట్విటర్ ద్వారా తెలియజేశారు. తన భార్యతో విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు. వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాలకు సంబంధించిన కొన్ని విషయాలు మీతో పంచుకోవాలంటూ సోషల్ మీడియాలో లేఖ మొదలు పెట్టాడు. తమ ఇద్దరి మధ్య బంధం ముగిసిందని చెప్పారు. చాలా సందర్భాల్లో మనస్పర్ధలు వచ్చిన నేపథ్యంలో విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఒకరంటే ఒకరికి గౌరవం ఉంది. వ్యక్తిగత కారణాలు వల్ల సినిమాలపై దృష్టి సారించలేకపోయానన్నారు. తనకు అండగా నిలిచిన స్నేహితులు, కుటుంబ సభ్యులకు థాంక్స్ చెప్పారు. మళ్లీ సినిమాల్లో నటించనున్నట్లు చెప్పారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.

One comment on "విడాకులు తీసుకున్న మంచు మనోజ్ దంపతులు..!"

Comments are closed.