ఢిల్లీ: రాష్ట్రపతి భవన్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు స్వాగత కార్యక్రమం ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి భవన్‌ చేరుకున్న ట్రంప్‌ దంపతులకు రాష్ట్రపతి రామ్‌నాత్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతం పలికారు. అనంతరం ట్రంప్‌ త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. ట్రంప్‌ దంపతులు రాజ్‌ఘాట్‌కు బయల్దేరారు. అక్కడ మహాత్మాగాంధీ సమాధి వద్ద ట్రంప్‌ నివాళులర్పించనున్నారు.

ట్రంప్‌ గౌరవార్థం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ మంగళవారం విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ను కూడా ఆహ్వానించారు. అయితే తాను విందుకు రాలేకపోతున్నానని సమచారం అందించారు. ఇందుకు విచారం వ్యక్తం చేస్తున్నానని రాష్ట్రపతి కార్యాలయానికి మన్మోహన్‌ సమాచారం చెరవేశారు. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాకు ఈ విందులో ఆహ్వానం లభించలేదు.

అయితే అనారోగ్య కారణాల వల్ల విందులో పాల్గొనడం లేదని మన్మోహన్‌ చెబుతున్నా.. దీని వెనుక ఇంకో కోణం ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. అలాంటప్పుడు తాము విందులో ఎలా పాల్గొంటామని కాంగ్రెస్‌ నేత ఆజాద్‌ పేర్కొన్నారని సమాచారం. తాము రాష్ట్రపతి విందుకు హాజరుకావడం లేదని కాంగ్రెస్‌ నేత రంజన్‌ చౌదరి తెలిపారు.

ఈ విందులో తెలంగాణ సీఎం కేసీఆర్‌‌తో పాటు కర్నాటక, అసోం, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, హర్యానా, బీహార్‌ల సీఎంలు పాల్గొననున్నారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.