విషమంగా ఢిల్లీ డిప్యూటీ సీఎం ఆరోగ్యం..!

By సుభాష్  Published on  25 Sep 2020 2:41 AM GMT
విషమంగా ఢిల్లీ డిప్యూటీ సీఎం ఆరోగ్యం..!

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. దీంతో ఆయనను హుటాహుటిన ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రి నుంచి మ్యాక్స్‌ ఆస్పత్రికి తరలించారు. ఇటీవల కోవిడ్‌, డెంగ్యూతో బాధపడుతున్న ఆయన తీవ్ర అస్వస్థతకు గురి కాగా, ఎల్‌ఎన్‌జేపీ ఆస్సత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్లేట్‌లెట్లు పడిపోవడం, ఆక్సీమీటర్‌ శాతం పడిపోవడంతో ఆయన ఆరోగ్య మరింత క్షీణించింది.

దీంతో ఆయనను అక్కడి నుంచి సాకేత్‌లోని మ్యాక్స్‌ ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సూచనల మేరకు కరోనా పరీక్షలు చేయించుకోగా, అతనికి పాటిజివ్‌ వచ్చింది. కాగా, ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ సిసోడియా ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

కాగా, ఈనెల 14న ఆయనకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండగా, కరోనాతో పాటు డెంగ్యూ కూడా ఎటాక్‌ కావడంతో గడిచిన 24 గంటల్లో మరింత విషమించిందని లోక్‌నాయక్‌ నాయక్‌ జయప్రకాశ్‌ నాయక్‌ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. రక్తకణాల సంఖ్య మరింత తగ్గిపోవడంతో పాటు శరీరంలోఆక్సిజన్‌ శాతం కూడా పడిపోయిందని అన్నారు.

మెరుగైన చికిత్స కోసం మరో ప్రైవేటు ఆస్పత్రికి తరలించామని వెల్లడించారు. మనీశ్‌ ఆరోగ్య పరిస్థితిపై పార్టీ నేతలు, అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆయన క్షేమంగా తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నారు. మరో వైపు దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు మరింత పెరిగిపోతున్నాయి. కోలుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉన్నా..రోజువారీ కేసుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. తాజాగా లెక్కల ప్రకారం.. ఢిల్లీలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 2 లక్షల 60వేలు దాటిపోయింది.

Next Story