కేసీఆర్‌ పూటకో మాట.. రోజుకో తీరులా వ్యవహరిస్తున్నారు..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  15 Nov 2019 1:04 PM GMT
కేసీఆర్‌ పూటకో మాట.. రోజుకో తీరులా వ్యవహరిస్తున్నారు..!

ముఖ్యాంశాలు

  • ఆర్టీసీని కేసీఆర్‌ ప్రైవేట్‌ చేయాలని చూస్తున్నారు: మందకృష్ణ మాదిగ
  • కార్మికులు అధైర్య పడాల్సిన అవసరం లేదు: మందకృష్ణ మాదిగ

హైదరాబాద్‌: ఆర్టీసీ కార్మికుల సమ్మె శుక్రవారంతో 42వ రోజుకు చేరుకుంది. గచ్చిబౌలి హెచ్‌సీయూ బస్‌ డిపోలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ మద్దతు తెలిపారు. ఏపీలో ఆర్టీసీ విలీనం చేస్తుంటే కేసీఆర్‌కు మాత్రం ప్రైవేట్‌ పరం చేసేందుకు కుట్ర పన్నుతున్నారని మందకృష్ణ ఆరోపించారు. ఏపీలో ఆర్టీసీని విలీనం చేసేందుకు కేంద్రం అంగీకరించి, తెలంగాణలో మాత్రం అంగీకరించదా అంటూ మందకృష్ణ మాదిగ ప్రశ్నించారు. కోర్టు కార్మికులకు అండగా ఉంది. కార్మికులు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఆర్టీసీ విషయంలో కేసీఆర్‌ పూటకో మాట.. రోజుకో తీరు వ్యవహరిస్తున్నారని కేసీఆర్‌ మండిపడ్డారు. కార్మికులను తెలంగాణ సమాజం అండగా ఉంది. కార్మికులు అధైర్య పడాల్సిన అవసరం లేదని మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. ఆర్టీసీకి కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్టులు, టీడీపీ అన్ని పార్టీలు అండగా ఉన్నాయని మందకృష్ణ మాదిగ ఆరోపించారు.

Next Story