అధికార పార్టీ నేతనంటూ.. గన్‌తో వ్యక్తి హల్‌ చల్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 Jun 2020 3:26 AM GMT
అధికార పార్టీ నేతనంటూ.. గన్‌తో వ్యక్తి హల్‌ చల్‌

హైదరాబాద్‌లో ఓ వ్యక్తి హల్‌చల్‌ చేశాడు. తాను అధికార పార్టీ నేతనంటూ గన్ పట్టుకుని బస్తీ వాసులను బెదిరించాడు. ఈ ఘటన మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మస్తాన్ నగర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

మంగళవారం రాత్రి TS04EX7777 నెంబర్‌ గల స్కార్పియో వాహనంలో వచ్చిన ఓ వ్యక్తి.. రోడ్లపై వాహనాలు ఎందుకు నిలిపారంటూ స్థానికులతో గొడవకు దిగాడు. తాను అధికార పార్టీకి చెందిన వ్యక్తి అని.. రోడ్లపై వాహనాలు ఎందుకు ఆపారంటూ హంగామా సృష్టించాడు. తన జేబులోంచి తుపాకీ తీసి బెదిరింపులకు దిగాడు. స్థానికులు పెద్ద ఎత్తున గుమి గూడడంతో నెమ్మదిగా అక్కడ నుంచి జారుకున్నాడు. ఈ తతంగాన్ని అంతా స్థానికులు వీడియో తీశారు. స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న మాదాపూర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. స్కార్పియో వాహనం నంబర్‌ ప్లేట్‌ పై పార్లమెంట్‌ సభ్యుడు అని రాసి ఉండడంతో రాజకీయ నేతకు సన్నిహితుడు అయి ఉండాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

Next Story