కరోనా వ్యాప్తిికి‌ చెక్‌: దక్షిణ మధ్య రైల్వే కొత్త టెక్నాలజీ.. తొలిసారిగా సికింద్రాబాద్‌లో ప్రయోగం

By సుభాష్  Published on  9 Jun 2020 8:28 AM GMT
కరోనా వ్యాప్తిికి‌ చెక్‌: దక్షిణ మధ్య రైల్వే కొత్త టెక్నాలజీ.. తొలిసారిగా సికింద్రాబాద్‌లో ప్రయోగం

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో విజృంభిస్తుండటంతో లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కరోనాను అరికట్టేందుకు దక్షిణ మధ్యరైల్వే శాఖ వినూత్న చర్యలకు శ్రీకారం చుట్టింది. ఆటోమెటిక్‌ బుల్లెట్‌ థర్మల్‌ స్క్రీనింగ్ ఇమేజ్‌ డిటెక్ట్‌ కెమెరాలు అధికారులు ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రయోగాన్ని సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో మొదటిసారిగా ప్రయోగించబోతున్నారు. దీని వల్ల థర్మల్‌ స్క్రీనింగ్‌ కోసం ప్రతి వ్యక్తిని నేరుగా చెక్‌ చేసే విధానానానికి బ్రేక్‌ పడనుంది.

ఈ కొత్త టెక్నాలజీ ద్వారా ఒకేసారి 10 మందికి శరీర ఉష్ణోగ్రతను తెలుసుకునే అవకాశం ఉంటుంది. శరీరంలో ఉష్ణోగ్రతల్లో తేడా కనిపించినట్లయితే వెంటనే అలారమ్‌ మోగుతుంది. అలాగే డిటెక్ట్‌ చేసిన వ్యక్తుల వివరాలు నెల రోజుల పాటు భద్రంగా నమోదు చేసే అవకాశం ఉంటుంది. ఇక రద్దీగా మారుతున్న సమయంలో ఇలాంటి టెక్నాలజీతో అవసరమని రైల్వేశాఖ అధికారులు చెబుతున్నారు.

Next Story