కామాంధుడి వెకిలి చేష్టలు..భయం గుప్పిట్లో మన్యం

By రాణి  Published on  3 April 2020 3:10 PM GMT
కామాంధుడి వెకిలి చేష్టలు..భయం గుప్పిట్లో మన్యం

విశాఖ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో మన్యంకూడా ఒకటి..ప్రశాంతతకు పెట్టింది పేరు. శీతాకాలంలో అరకు అందాలను చూసేందుకు వచ్చే టూరిస్టులు చుట్టు పక్క ప్రాంతాలైన మన్యం, పాడేరులను కూడా సందర్శిస్తారు. అలాంటి మన్యంలో ఉండే ప్రజలు ఇప్పుడు భయం గుప్పిట్లో బిక్కుబిక్కు మంటూ గడపాల్సిన పరిస్థితి. విశాఖ జిల్లాలో 11 కరోనా కేసులు నమోదవ్వడంతో హై అలర్ట్ అయ్యారు అధికారులు. అసలే కరోనాతో భయపడి చస్తుంటే..మరోవైపు కామాంధుడి వెకిలి చేష్టలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.

Also Read : 10 లక్షలు దాటిన కరోనా కేసులు

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..హుకుంపేట మండలం కోట్నపల్లి పంచాయతీ మసాడా గ్రామ సమీపంలోని గొందువలస గ్రామంలో మంజూష (పేరు మార్చబడింది) అనే 5 ఏళ్ల పాప ఉంది. ఆ పాప మీద 50 సంవత్సరాల వ్యక్తి కన్ను పడింది. మనుమరాలి వయసు పాపతో తన కామవాంఛ తీర్చుకోవాలనుకున్నాడు. ఆ పాపకు చిరుతిండి ఆశచూపించి ఇంటికి సమీపంలోని పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారయత్నం చేసినట్లు తల్లి గ్రామపెద్దలకు ఫిర్యాదు చేసింది. దీంతో విషయం బయటికొచ్చింది.

Also Read : కరోనాను జయించిన సింగర్

ఇంట్లో పాప కనిపించకపోవడంతో తల్లి చుట్టుపక్కల వెతుకుతుండగా పొదల చాటు నుంచి ఏడుపు వినిపించింది. అక్కడికి వెళ్లి చూసిన ఆమె షాక్ అయింది. పాపపై లైంగిక కోరిక తీర్చుకుంటున్న కొండబాబు (50) కు దేహశుద్ధి చేయడంతో అతను అక్కడి నుంచి ఉడాయించినట్లు బాధితురాలి తల్లి గ్రామ పెద్దలకు తెలిపింది. విషయం మొత్తం తెలుసుకున్న గ్రామస్తులు, గ్రామ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ మానవ మృగాన్ని వెతికి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. గ్రామానికి వచ్చిన ఎస్సై అప్పలనాయుడు ఎం డి ఓ ఇమ్మానియేల్ బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తనకూతురికి జరిగిన అన్యాయం మరొకరికి జరగకుండా కొండబాబును కఠినంగా శిక్షించాలని కోరారు బాధితురాలి తల్లి, మానవ హక్కుల పరిరక్షణ ప్రతినిధి తపుల కృష్ణారావు.

Also Read :లాక్ డౌన్ డేస్..ఈ సెలబ్రిటీలు ఏం చేస్తున్నారో చూడండి

Next Story