ప్రపంచాన్ని కుదిపేస్తోన్న కరోనా దేశాల మంత్రులు, సెలబ్రిటీలను సైతం వదలడం లేదు. నాలుగు రోజుల వ్యవధిలోనే ఇద్దరు అమెరికన్ సింగర్లు కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా..కరోనా బారిన పడిన మరో సింగర్ సారా బరేలిస్ తాను పూర్తిగా కరోనా నుంచి కోలుకున్నానని చెప్తున్నారు. ఈ మేరకు ఆమె తన ఇన్ స్టాలో వీడియో పోస్ట్ చేశారు.

Also Read : లాక్ డౌన్ డేస్..ఈ సెలబ్రిటీలు ఏం చేస్తున్నారో చూడండి

ప్రస్తుతం అమెరికా పరిస్థితి చాలా దయనీయంగా మారింది. ప్రపంచదేశాలన్నింటిలోనూ అగ్రరాజ్యమైన అమెరికాలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. కంటికి కనిపించని శతృవుతో లక్షల మంది ప్రజలు ఆస్పత్రుల్లో జీవన్మరణాలతో పోరాడుతున్నారు. శుక్రవారం నాటికి అమెరికాలో 6 వేల మందికి పైగా మరణించగా..కరోనా కేసుల సంఖ్య 2.5 లక్షలకు చేరువలో ఉంది. ఇప్పటి వరకూ 60 లక్షల మంది నిరుద్యోగులు తమకు కష్టకాలంలో సహాయం చేయాలంటూ ప్రభుత్వానికి అర్జీలు పెట్టుకున్నారు. త్వరలోనే ఈ సంఖ్య కోటికి చేరే అవకాశాలున్నాయని అక్కడి ఆర్థిక వేత్తల అంచనా.

Also Read :10 లక్షలు దాటిన కరోనా కేసులు

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.