ఇచ్చిన అప్పు చెల్లించ‌మ‌న్నందుకే స్నేహితుడి దారుణ హ‌త్య‌

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  25 Nov 2019 12:15 PM IST
ఇచ్చిన అప్పు చెల్లించ‌మ‌న్నందుకే స్నేహితుడి దారుణ హ‌త్య‌

ఇప్పు ఇచ్చి తిరిగి ఇవ్వ‌మ‌న్నందుకే ఆయ‌నకు శాప‌మైంది. ఇచ్చిన అప్పు తిరిగి చెల్లించాల‌ని కోరిన ఓ వ్యక్తి దారుణ హత్యకు గుర‌య్యాడు. గుంటూరు జిల్లా క్రోసూరు మండలం గరికపాడులో చోటు చేసుకున్న ఈ దారుణం తీవ్ర సంచ‌ల‌నంగా మారింది. గోపీకృష్ణ, కృష్ణ ప్రసాద్ ఇద్ద‌రూ స్నేహితులు. రెండేళ్ల క్రితం కృష్ణప్రసాద్‌ దగ్గర గోపీకృష్ణ రూ.5లక్షలు అప్పు తీసుకున్నాడు. కొంతకాలం తర్వాత త‌న‌కు అత్య‌వ‌స‌రంగా ఉంద‌ని, తాను ఇచ్చిన అప్పు చెల్లించాల‌ని కృష్ణ ప్రసాద్‌ అడిగాడు. ఇలా అప్పు చెల్లించాల‌ని అడుగుతుండ‌టంతో గోపీ తప్పించుకుని తిరుగుతున్నాడు. ఇప్పు ఇవ్వాల‌ని ప్రసాద్ నుంచి ఒత్తిడి పెరగడంతో.. ఆగ్రహానికి లోనైన‌ గోపీకృష్ణ.. ప్రసాద్ హత‌మార్చేందుకు ప్లాన్ చేశాడు. కృష్ణప్రసాద్‌ను మ‌ద్యం తాగుదామ‌ని మాయ‌మాట‌లు చెప్పి న‌మ్మించి పొలాల్లోకి తీసుకెళ్లి దారుణంగా కొట్టి హ‌త‌మార్చిన‌ట్లు పోలీసులు వివ‌రించారు. ప్ర‌సాద్‌ను ఆదివారం హ‌త్య చేసిన గోపీ, సోమ‌వారం క్రోసూరు పోలీసుల ముందు లొంగిపోయాడు. ప్ర‌సాద్ త‌న‌కు అప్పు ఇచ్చాడ‌ని, ఇచ్చి అప్పు ఇవ్వాల‌ని రోజురోజుకు త‌న‌పై ఒత్తిడి తీసుకువ‌స్తున్నాడ‌ని, అందుకే అత‌న్ని చంపేశాన‌ని పోలీసు ముందు ఒప్పుకున్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Next Story