కరోనా మహమ్మారి ఇప్పుడు దేశ ప్రజలందరినీ భయ కంపితులను చేస్తోంది. ముఖ్యంగా ఢిల్లీ జమాత్ కార్యక్రమానికి వెళ్లొచ్చిన వారిలో పదుల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు మరింత అప్రమత్తమయ్యాయి. ఢిల్లీ వెళ్లొచ్చిన వారితో పాటు..వారితో కలియతిరిగిన వారికి కూడా కరోనా పరీక్షలు చేస్తున్నారు వైద్యులు. తాజాగా కర్ణాటకలో ఢిల్లీకి వెళ్లొచ్చిన 65 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. రాష్ట్రంలో ఇది 3వ కరోనా మరణం. మార్చి 5వ తేదీన ఢిల్లీ వెళ్లిన వ్యక్తి తిరిగి 11వ తేదీన సొంతూరైన తుముకూరుకు చేరుకున్నాడు. కరోనా లక్షణాలు కనిపించడంతో ఆస్పత్రిలో చేరి.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతనితో 33 మంది కాంటాక్ట్ అయినట్లు సమాచారం.

Also Read : సీబీఎస్ఈ విద్యార్థులకు శుభవార్త..పరీక్షలు లేకుండానే పై తరగతులకు

అలాగే మృతుడికి ముగ్గురు భార్యలు, 16 మంది పిల్లలున్నారు. వారికి కూడా కరోనా సోకిందేమోనని స్థానికులు అనుమానం వ్యక్తం చేసిన నేపథ్యంలో..వారందరినీ ప్రస్తుతం హోం క్వారంటైన్ లో ఉంచారు. వారితో సన్నిహితంగా మెలిగిన కుటుంబాలను కూడా స్వీయ నిర్భంధంలో ఉంచినట్లుగా తుముకూరు డిప్యూటీ కలెక్టర్ వెల్లడించారు.

బుధవారం సాయంత్రానికి దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 1700కు చేరింది. తమిళనాడులో ఒక్కరోజే అత్యధికంగా 110 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో 97, ఏపీలో 87 కేసులు నమోదవ్వగా..ఇంకా వేల మంది కరోనా టెస్టుల రిపోర్టులు రావాల్సి ఉంది.

Also Read : మా అమ్మ అంత్యక్రియలకు వెళ్తే ఆవిడ ఆత్మ శాంతించదు : ఎస్సై

రాణి యార్లగడ్డ

Next Story