కరోనా ప్రభావంతో ఇప్పటికే ఆంధ్రా, తెలంగాణలో 6-9 వ తరగతి విద్యార్థులను పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేశారు. తాజాగా దేశంలో ఏప్రిల్ 14 వరకూ లాక్ డౌన్ ఉండటంతో సీబీఎస్ఈ లో చదవుతున్న 1 – 8వ తరగతి విద్యార్థులందరినీ పై తరగతులకు ప్రమోట్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది కేంద్ర నవ వనరుల అభివృద్ధి శాఖ. ఈ మేరకు హెచ్ఆర్డీ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ ట్వీట్ చేశారు.

దేశంలో కరోనా రోజురోజుకూ విజృంభిస్తుండటంతో దేశంలో ఇప్పుడప్పుడే లాక్ డౌన్ ను ఎత్తివేసే పరిస్థితి లేదు. ఇప్ప‌టికే చాలా రాష్ట్రాల‌తో పాటు సీబీఎస్ఈకి సంబంధించి కూడా అక‌డమిక్ పరీక్ష‌లు ముగియ‌లేదు. దీంతో ఈ మేరకు విద్యార్థులను పాస్ చేసి, పై తరగతులకు ప్రమోట్ చేస్తున్నట్లు తెలిపారు. 9,10 తరగతులు విద్యార్థులు మాత్రం ప్రాజెక్టులు, పీరియాడిక్ పరీక్షలు, టర్మ్ ఎగ్జామ్స్ తదితర మదింపుల ఆధారంగా పై తరగతులకు పంపుతామని మంత్రి రమేష్ వెల్లడించారు. ఈ సారి ప్ర‌మోట్ విద్యార్థులు పాఠశాల ఆధారిత పరీక్షలు, ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో కనిపించవచ్చని ఆయన అన్నారు.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.