గోల్కోండ పీఎస్ పరిధిలో వ్యక్తి దారుణ హత్య
By తోట వంశీ కుమార్ Published on 5 Jun 2020 12:35 PM IST
హైదరాబాద్ : గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని బంజారా దర్వాజ వద్ద దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని దుండగులు ఓ వ్యక్తిని బండరాళ్లతో తలపై మోదీ దారుణంగా హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మృతుడిని విజయ్‌నగర్ కాలనీకి చెందిన రాహుల్ అగర్వాల్‌గా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పాత కక్షల నేపథ్యంలోనే హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
Next Story