విజ‌య‌వాడ‌లో రెచ్చిపోయిన ప్రేమోన్మాది

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  15 Oct 2020 8:52 AM GMT
విజ‌య‌వాడ‌లో రెచ్చిపోయిన ప్రేమోన్మాది

విజ‌య‌వాడ‌లో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ఇంజనీరింగ్‌ విద్యార్థినిపై కత్తితో దాడి చేసి హతమార్చాడు. అనంతరం తనను తాను కత్తితో పొడుచుకున్నాడు. ప్రస్తుతం అతని ప‌రిస్థితి విషమంగా ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజ‌య‌వాడలో ఇంజనీరింగ్‌ చదువుతున్న ఓ యువతిని స్థానికంగా ఉంటున్న స్వామి అనే యువకుడు కొంతకాలం ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. తన ప్రేమను నిరాకరించిందని కక్ష కట్టిన స్వామి.. గురువారం యువతి ఇంటికి వెళ్లి కత్తితో దాడి చేశారు.

దీంతో తీవ్రంగా గాయపడిన యువతిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. యువ‌తిపై దాడి చేసిన‌ అనంతరం స్వామి తనను తాను కత్తితో గాయపర్చుకున్నాడు. ప్రస్తుతం స్వామి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం అతని ప‌రిస్థితి విషమంగా ఉంది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Next Story
Share it