టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డికి చేదు అనుభ‌వం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  15 Oct 2020 7:56 AM GMT
టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డికి చేదు అనుభ‌వం

ఇబ్రహింపట్నం ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ నేత‌ మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి చేదు అనుభ‌వం ఎదురైంది. ఆయన గురువారం మేడిపల్లి చెరువు పూజలు చేసేందుకు గ్రామానికి వెళ్లారు. ఎమ్మెల్యే రాకను గ్రామ ప్రజలు, రైతులు అడ్డుకున్నారు. తమ గ్రామంలోకి ఎమ్మెల్యే రావడానికి వీల్లేదని కిషన్‌రెడ్డిని నిలువరించబోయారు. ఆయన కాన్వాయ్‌పై రైతులు రాళ్లు, చెప్పులు విసిరారు.

ఫార్మాసిటితో భూములు కోల్పోతుంటే పరామర్శించకుండా.. బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ రైతులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఫార్మసీటీ భూసేకర నిలిపివేయాలంటూ నినాదాలు చేశారు. రైతులు విసిరిన రాళ్ల దాడిలో ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. అంత‌కుముందు మేడిపల్లి చెరువు సందర్శనకు ఎమ్మెల్యే రానుండ‌టంతో పోలీసులు కొంతమంది రైతులను ముందస్తుగా అరెస్ట్ చేశారు. మాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డితో సహా పలువురు నాయకులను అదుపులోకి తీసుకున్నారు.

Next Story