ఆ దుర్మార్గుడు నాలుగో త‌ర‌గ‌తి పాప‌కు ముద్దుపెట్టాడు.. విష‌యం పెద్ద‌ల‌కు తెలియ‌డంతో..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 Nov 2019 8:36 AM GMT
ఆ దుర్మార్గుడు నాలుగో త‌ర‌గ‌తి పాప‌కు ముద్దుపెట్టాడు.. విష‌యం పెద్ద‌ల‌కు తెలియ‌డంతో..

తూర్పుగోదావరి : జిల్లా కేంద్రంలోని రామచంద్రపురం వైఎస్ నగర్ నందు దారుణం చోటుచేసుకుంది. ప్రభుత్వ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న బాలికను.. అదే స్కూల్లో పనిచేస్తున్న స్వీపర్ భర్త పలివెల జిన్న పెద‌వుల‌పై ముద్దుపెట్టుకున్నాడు.

వెంట‌నే.. స్కూల్ నుండి ఏడుస్తూ ఇంటికి వెళ్లిన పాప‌.. పెద‌వుల‌పై ముద్దు పెట్టాడంటూ తల్లిదండ్రులకు చెప్పడంతో చుట్టుపక్కల జ‌నాలు అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని విచారిస్తున్నారు.

Next Story
Share it