నా భార్యను నడిరోడ్డుపై ఊరి తీయండి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 Nov 2019 11:05 AM GMT
నా భార్యను నడిరోడ్డుపై ఊరి తీయండి

కాకినాడలో దీప్తిశ్రీ హత్యకేసు సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఆస్తి కోసం సవతి తల్లే కిడ్నాప్‌ చేసి దారుణంగా హతమార్చి, పాప మృతదేహాన్ని మూటకట్టి ఇంద్రపాలెం వంతెన వద్ద పడేసింది. ఇక తన కూతురు లేదన్న బాధను తండ్రి శ్యామ్‌కుమార్ జీర్ణించుకోలేకపోతున్నాడు. పాపను తలచుకుంటూ కుమిలి కుమిలిపోతున్నాడు. తల్లి లేని బిడ్డ కదా అని పాప ఆలనాపాలన చూసుకుంటుందని శాంతకుమారిని వివాహం చేసుకుంటే ఇంత ఘోరమైన పని చేస్తుందని అనుకోలేదని కన్నీరు మున్నీరవుతున్నాడు. దీప్తిశ్రీని దారుణంగా చంపిన తన భార్యను నడిరోడ్డుపై ఉరి తీయాలంటున్నాడు.

కాకినాడ పగడాల పేటకు చెందిన సత్య శ్యామ్‌కుమార్‌, సత్యవేణిలకు దీప్తి శ్రీ జన్మించింది. రెండేళ్ల క్రితం సత్యవేణి అనారోగ్యంతో మృతి చెందడంతో, శ్యామ్‌కుమార్‌ శాంతి కుమారిని రెండోపెళ్లి చేసుకున్నాడు. వారికి మరో 13 నెలల బాబు కూడా ఉన్నాడు. రెండో పెళ్లి తర్వాత కూడా శ్యామ్‌కుమార్ కుటుంబం ఆనందంతో ఉంది. దీప్తిశ్రీ స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. మూడు రోజుల క్రితం స్కూల్‌కు వెళ్లిన దీప్తిశ్రీ.. మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయింది. ఇంతకు ముందు జరిగిన కొన్ని సంఘటలతో భర్త శ్యామ్‌కుమార్‌కు అనుమానం వచ్చి శాంతికుమారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగప్రవేశం చేసిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించడంతో అసలు నిజాన్ని బయట పెట్టేసింది. ఆస్తి కోసమే పాపను తానే హత్య చేసినట్లు పోలీసుల ముందు అంగీకరించింది.

Next Story
Share it