మల్లిక చూపు.. టాలీవుడ్ వైపు

By అంజి  Published on  4 Feb 2020 6:15 AM GMT
మల్లిక చూపు.. టాలీవుడ్ వైపు

మల్లిక షెరావత్.. ఒకప్పుడు బాలీవుడ్ ను ఊపు ఊపేసిన హీరోయిన్..! ఈ హాట్ యాక్ట్రెస్ హాలీవుడ్ లో కూడా నటించింది. 2002 లో బాలీవుడ్ లో అడుగుపెట్టిన మల్లిక అక్కడి జనాలను తన అందంతో అలరించింది. ఎన్నో హిట్ డాన్స్ నంబర్స్ తో కూడా మల్లిక ఒక ఊపు ఊపింది. దక్షిణాది ప్రేక్షకులకు కూడా మల్లిక పరిచయమే..! కమలహాసన్ గ్రేట్ ప్రాజెక్ట్ అయిన దశావతారం సినిమాలో కూడా మల్లిక కీలక పాత్రను పోషించింది. ఇప్పటివరకూ మల్లిక టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వలేదు.. కానీ అతి త్వరలో మల్లిక తెలుగు ఇండస్ట్రీలో కాలుపెట్టబోతోంది. అందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

హారర్ థ్రిల్లర్ గా రూపొందబోతున్న సినిమాలో మల్లిక నటించబోతోంది. ఈ సినిమా దక్షిణాది భాషల్లో కూడా రూపొందనుంది. దర్శకుడు వి.సి.వడివుడయాన్ ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. తాను స్క్రిప్ట్ తీసుకొని ముంబైకు వెళ్ళానని.. స్క్రిప్ట్ వినగానే మల్లిక షెరావత్ ఈ సినిమాలో నటించడానికి ఓకె చెప్పిందని ఆయన అన్నారు. చాలా రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న మల్లిక ఒక మంచి స్క్రిప్ట్ దొరికితే యాక్ట్చేయడానికి సిద్ధంగా ఉందని.. తాను చెప్పిన స్క్రిప్ట్ లో నటనకు కూడా మంచి అవకాశం ఉండడంతో ఆమె అంగీకారం తెలిపిందని ఆయన అన్నారు. ఈ సినిమాలో ఆధునిక మహారాణి పాత్రను మల్లిక పోషించనుంది.

మల్లిక కాస్ట్యూమ్స్, లుక్స్ విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టామని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాలో మల్లికకు కొన్ని యాక్షన్ సీన్స్ కూడా ఉండడంతో ఇప్పటికే ఆమె జిమ్ లో కసరత్తులు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. మల్లిక మంచి నటిగా ప్రూవ్ చేసుకునే అవకాశం ఇప్పటివరకూ ఒక్క సినిమా ద్వారా కూడా రాలేదు.. ఈ సినిమా ద్వారా ఆమె తనలో మంచి నటి ఉందని ప్రేక్షకులకు నిరూపించాలని అనుకుంటోంది. ఫిబ్రవరి నెల ఆఖరుకు మల్లిక వేకప్ వేసుకోబోతోంది. హైదరాబాద్, బెంగళూరు, సౌత్ ఆఫ్రికాలలో ఆమెపై సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

Next Story
Share it