తెలంగాణ యువత పై కరోనా ఎటాక్
By తోట వంశీ కుమార్ Published on 29 July 2020 11:17 AM GMTతెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఈ మహ్మమారి భారీన పడుతున్న వారిలో యువతే అధికంగా ఉంటోంది. అంతేకాదు వారు కరోనా అంటించుకుని కుటుంబ సభ్యులకు కూడా కరోనా అంటిస్తున్నారు. మొత్తం కేసుల్లో పురుషుల సంఖ్య ఎక్కవగా ఉంది. గణాంకాలు ఈ విషయాన్ని చెబుతున్నాయి.
ముఖ్యంగా 21-40 ఏళ్ల మధ్య వయస్కుల్లో 47.1 శాతం మంది కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. వైద్యఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో పురుషులు (65.6 శాతం)లు అధికంగా ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం మరణాల్లో కేవలం కొవిడ్ కారణంగానే మృతిచెందినవారు 46.13 శాతంగా, కరోనాతోపాటు ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు 53.87 శాతంగా ఉన్నట్టు ఆరోగ్యశాఖ గణాంకాలు చెబుతున్నాయి.
ఎక్కువగా యువత కరోనా బారిన పడటానికి కారణం ఏంటంటే..?
లాక్‌డౌన్ ఎత్తివేత తర్వాత ఉద్యోగ, వ్యాపార అవసరాల కోసం బయటకు వెళ్లక తప్పడం లేదు. దీంతో యువత ఎక్కువగా ఈ మహమ్మారి బారిన పడుతున్నట్లు వైద్యులు అంచనా వేస్తున్నారు. 60ఏళ్లకు పై బడిన వారు దాదాపుగా ఇంట్లోంచి బయటకు రావడం లేదు. కళాశాలలు, పాఠశాలలు ఇంకా ప్రారంభం కాకపోవడంతో 20ఏళ్ల లోపు వారు ఇంట్లోనే ఉంటున్నారు. అయినప్పటికి వారు కరోనా బారిన పడుతున్నారు. 20-61 మధ్య వయస్కుల ద్వారానే పిల్లలకు, వృద్దులకు కరోనా వైరస్ వ్యాపి చెందుతోందని అంటున్నారు. ఇక తప్పని సరిగా బయటకు వెళ్లేవారు మాస్కులు వాడాలని, ఆరు అడగుల భౌతిక దైరం పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.
నిన్న(మంగళవారం 28న) 18,858 శాంపిల్స్‌ను పరీక్షించగా..కొత్తగా మరో 1,764 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 12 మంది మృతిచెందినట్లు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. వీటితో కలిపి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 58,906కి చేరింది. ఈ మహమ్మారి బారీన పడి మొత్తం 492 ప్రాణాలు కోల్పోయారు. తాజాగా 803 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో.. ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 43,751కి చేరింది. 14,663 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఆదిలాబాద్ – 15, భద్రాద్రి కొత్తగూడెం-30, జీహెచ్‌ఎంసీ -509, జగిత్యాల-12, జనగాం-13, జయశంకర్ భూపాలపల్లి –8, జోగులాంబ గద్వాల -22, కామారెడ్డి -10, కరీంనగర్ -93, ఖమ్మం -69, ఆసిఫాబాద్ -6, మహబూబ్ నగర్ -47, మహబూబాబాద్ -9, మంచిర్యాల- 28, మెదక్ – 23, మేడ్చల్ మల్కాజ్‌గిరి – 158, ములుగు –17, నాగర్‌కర్నూల్ – 29, నల్లగొండ – 51, నారాయణపేట -7, నిర్మల్ -8, నిజామాబాద్ –47, పెద్దపల్లి -44, రాజన్న సిరిసిల్ల -13, రంగారెడ్డి -147, సంగారెడ్డి -89, సిద్దిపేట – 21, సూర్యాపేట-38, వికారాబాద్-7, వనపర్తి – 4, వరంగల్ రూరల్ -41, వరంగల్ అర్భన్ -138, యాదాద్రి భువనగిరి -11 మొత్తం 33 జిల్లాల్లో కేసులు నమోదు అయ్యాయి.