మహేష్‌బాబు న్యూ లుక్.. అభిమానులు ఫిదా
By తోట వంశీ కుమార్ Published on 10 Sept 2020 3:27 PM ISTకరోనా వైరస్ కారణంగా దాదాపు ఐదు నెలలుగా షూటింగ్‌లు నిలిచిపోయాయి. దీంతో నటీనటులు అంతా ఇంటికే పరిమితం అయ్యారు. ఇక ప్రభుత్వాలు విడుదల చేస్తున్న మార్గదర్శకాలతో టీవీ, సినిమా, యాడ్ షూటింగ్స్‌లు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. కరోనా నిబంధనలను పాటిస్తూ.. షూటింగ్‌లో పాల్గొంటున్నారు నటీనటులు. లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమయ్యారు సూపర్ స్టార్ మహేష్ బాబు. తనకు దొరికిన ఈ విరామాన్ని కుటుంబ సభ్యులతో కలిసి హాయిగా కాలం గడిపాడు. ఇక అభిమానులతోనూ సోషల్ మీడియాలో టచ్‌లో ఉన్నారు.
ఓ యాడ్ షూట్ కోసం తాజాగా మహేష్ బయటకు వచ్చారు. చాలా నెలల తర్వాత బయటకు వచ్చిన మహేష్ తన కొత్త లుక్‌తో ఫ్యాన్స్‌ను ఫిదా చేశాడు. లైట్‌గా గడ్డం, మీసాలు, డిఫరెంట్ హెయిర్ స్టైల్‌తో మహేష్ ఆకట్టుకుంటున్నాడు. ఈ ఫొటోపై నెటిజన్లు లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ప్రముఖ సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ అవినాష్ గోవారికర్ ఆధ్వర్యంలో ఈ యాడ్ షూట్ జరిగింది. మళ్లీ షూటింగ్‌కు రావడం సంతోషంగా ఉందని మహేష్ సోషల్ మీడియాలో కామెంట్ చేశాడు. కాగా.. మహేష్ ప్రస్తుతం సర్కారు వారి పాట చిత్రంలో నటిస్తున్నారు. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.
View this post on InstagramA post shared by Mahesh Babu (@urstrulymahesh) on