అమెరికాలో గాంధీజీకి అవమానం.. విగ్రహం ధ్వంసం

By సుభాష్  Published on  4 Jun 2020 5:19 AM GMT
అమెరికాలో గాంధీజీకి అవమానం.. విగ్రహం ధ్వంసం

అమెరికాలో జాతిపితత మహాత్మగాంధీ అవమానం జరిగింది. గాంధీజీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. అనేకమార్లు వివక్షను ఎదుర్కొన్న మహాత్మగాంధీకి వాషింగ్టన్‌ డీసీలోని భారతర ఆయబార కార్యాలయంలో ఉన్న విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. గత కొన్ని రోజులుగా అమెరికాలో నల్లజాతీయులు ఆందోళన చేస్తున్నే విషయం తెలిసిందే. ఇకతాజాగా భారత రాయబార కార్యాలయం ముందు జరిగిన ఆందోళనలో గుర్తు తెలియని దుండగులు గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేయడం తీవ్ర సంచలనంగా మారింది.

ప్రపంచ వ్యాప్తంగా కరోనాతో పాటు అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేస్తున్న వివాదస్పద వ్యాఖ్యలు తీవ్రస్థాయిలో చేరాయి. కాగా, విగ్రహం ధ్వంసంపై తక్షణమే అమెరికా ప్రభుత్వం విచారణ చేపట్టాలని, భారత ప్రభుత్వం ట్రంప్‌పై ఒత్తిడి తీసుకురావాలని, ఇది ఒక విగ్రహంపై జరిగిన దాడి కాదు.. భారత ఆత్మగౌరవంపై జరిగిన దాడి అని అభివర్ణిస్తూ విచారణ వేగవంతం చేయాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.

Next Story