మ‌హారాష్ట్ర రాజ‌కీయం : 24 గంట‌ల్లో బలపరీక్షకు ఆదేశించండి..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  25 Nov 2019 6:39 AM GMT
మ‌హారాష్ట్ర రాజ‌కీయం : 24 గంట‌ల్లో బలపరీక్షకు ఆదేశించండి..!

మహారాష్ట్ర రాజకీయంపై నేడు సుప్రీంలో వాదనలు జరుగుతున్నాయి. కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేనల‌ తరపు న్యాయవాది కపిల్ సిబల్ త‌మ వాద‌న‌లు కోర్టుకు వినిపించారు. ఉదయం 5గంటల‌కు రాష్ట్రపతి పాలన ఎత్తివేసే అంత అవసరం ఏమొచ్చిందంటూ ప్ర‌శ్నించారు. అలాగే.. తమకు మద్దతుగా 154 మంది ఎమ్మెల్యేలు ఉన్నారనీ.. దీనికి సంబందించి అఫిడవిట్లు సైతం ఉన్నాయంటూ క‌పిల్ సిబల్ పేర్కొన్నారు. ఆ 154 మంది ఎమ్మెల్యేల అఫిడవిట్లు పరిగణనలోకి తీసుకుని 24 గంటల్లోగా బలపరీక్ష నిర్వహించేలా ఆదేశించాలని ఆయన సుప్రీంకోర్టును కోరారు.

అంతేకాకుండా.. సభలో అత్యంత సీనియర్ నేతను ప్రొటెం స్పీకర్‌గా నియమించి, ఓపెన్ బ్యాలెట్ పద్ధతిలో బలపరీక్ష నిర్వహించాలని ఆయన కోరారు. బల పరీక్ష ప్రక్రియ మొత్తాన్ని వీడియో చిత్రీకరణ చేయాలని క‌పిల్ సిబ‌ల్ కోర్టుకు అభ్యర్థించారు.

అయితే.. రాష్ట్రపతి పాలన ఎత్తివేత అంశంపై తాము జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అలాగే.. 154 మంది ఎమ్మెల్యే అఫిడవిట్లు తీసుకునేందుకు కూడా కోర్టు నిరాకరించింది.

Next Story