మహారాష్ట్రకు కొత్త గవర్నర్‌...?

By Newsmeter.Network
Published on : 27 Nov 2019 1:55 PM IST

మహారాష్ట్రకు కొత్త గవర్నర్‌...?

మహారాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం అక్కడి రాజకీయాలు వేడివేడిగా కొనసాగుతున్నాయి. మహారాష్ట్ర సంక్షోభం తర్వాత ఎన్నో మార్పు చేర్పులు జరుగుతున్నాయి. ప్రస్తుతం మరో వార్త వైరల్‌ గా మారుతోంది. అదేంటంటే ...మహారాష్ట్రకు కొత్త గవర్నర్‌ రాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీని స్థానంలో కల్రాజ్‌మిశ్రా సూక్ష్మను నిమిస్తారని ఊహాగానాలు మొదలయ్యాయి. కల్రాజ్‌ మిశ్రా ప్రస్తుతం రాజస్ధాన్‌ గవర్నర్‌గా కొనసాగుతున్నారు. కాగా, మహారాష్ట్ర గవర్నర్‌ నియామకంపై కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో కల్రాజ్ మిశ్రా సూక్ష్మ చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖా మంత్రిగా పనిచేశారు.

అయితే రాజస్థాన్ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టేదానికంటే ముందు కల్రాజ్‌ మిశ్రా హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా కూడా సేవలందించారు. మహారాష్ర్ట గవర్నర్ గా భగత్ సింగ్ కోశ్యారీ ఈ ఏడాది సెప్టెంబర్ లో ప్రమాణస్వీకారం చేశారు. కాగా, మహారాష్ట్ర రాజకీయాల్లో గవర్నర్‌ కోశ్యారీపై తీవ్ర ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో కొత్త గవర్నర్‌ నియమిస్తారని ఊహాగానాలు చర్చనీయాంశంగా మారింది. మరీ కేంద్ర కొత్త గవర్నర్‌ను నియమిస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.

Next Story