బిహార్ లో బోణి కొట్టిన ఎంఐఎం..!, గుజరాత్ లోనూ పుంజుకున్న కాంగ్రెస్...!

By సత్య ప్రియ  Published on  24 Oct 2019 5:18 AM
బిహార్ లో బోణి కొట్టిన ఎంఐఎం..!, గుజరాత్ లోనూ పుంజుకున్న  కాంగ్రెస్...!

బిహార్‌లో విచిత్రంగా ఎంఐఎం బోణి కొట్టింది. కిషన్ గంజ్‌ ఉప ఎన్నికలో ఎంఐఎం అభ్యర్ధి విజయం సాధించారు.

కేరళ ఉప ఎన్నికల్లో ప్రజలు అందర్నీ సమానంగా ఆదరించినట్లు కనిపిస్తోంది. మొత్తం 5చోట్ల ఉప ఎన్నికలు జరిగితే.. సీపీఎం2, కాంగ్రెస్ 2, మరో చోట ఐయూఎంఎల్ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు.

ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో కూడా కాంగ్రెస్ పుంజుకున్నట్లే కనిపిస్తోంది. గుజరాత్‌లో ఆరు చోట్ల ఉప ఎన్నికలు జరగ్గా 3 చోట్ల బీజేపీ, 3 చోట్ల కాంగ్రెస్‌ ఆధిక్యంలో ఉన్నాయి.

కేరళలో ఐదు స్థానాలకు ఉప ఎన్నికలు జరగగా.. రెండు చోట్ల సీపీఎం, రెండు చోట్ల కాంగ్రెస్‌, మరో చోట ఐయూఎంఎల్‌ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు.

హరియాణాలో హంగ్ ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం 90 స్థానాల్లో బీజేపి 35 సీట్లలో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ 32, ఐఎన్ఎల్డీ-జేజేపీ 11 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.

మహారాష్ట్ర, హరియాణ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మహారాష్ట్ర, హరియాణాలో బీజేపీ విజయం సాధిస్తుందని దాదాపు అన్ని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి.

మహారాష్ట్ర, హరియాణాలో బీజేపీ అధికారంలో ఉండగా, తిరిగి తమదే విజయమని ఆ పార్టీ బలంగా నమ్ముతోంది. అయితే, ప్రస్తుత ఫలితాల ప్రకారం మహారాష్ట్ర లో బిజేపి ఆధిక్యం కొనసాగుతున్న హరియాణాలో మాత్రం బిజెపి, కాంగ్రెస్ నువ్వ నేనా అనేట్టుగా పోటాపోటి పరిస్థితి నెలకొంది.

మహారాష్ట్రలో శివసేనతో జట్టుకట్టిన బీజేపీ 164 చోట్ల బరిలో నిలిచింది. మిత్రపక్షం శివసేన 124 స్థానాల్లోనూ పోటీ చేసింది. హర్యాణాలో 90 స్థానాలకు పోలింగ్ జరిగింది.

తాజా ఫలితాల ప్రకారం, మహారాష్ట్ర ముఖ్య మంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ లీడింగ్ లో ఉన్నారు, నాగపూర్ లో బిజెపి నాలుగు సీట్లు, కాంగ్రెస్ రెండు సీట్లలో గెలుపు దిశగా వెల్తున్నాయి.

హరియాణాలో కాంగ్రెస్ 30 సీట్లలో ముందంజలో ఉండగా, బీజేపీ 38 సీట్లలో ముందంజ లో ఉంది.

మధ్యాహ్నానికి తుది ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.

Next Story