కరోనా: చైనాను దాటేసిన మహారాష్ట్ర

By సుభాష్  Published on  8 Jun 2020 5:03 AM GMT
కరోనా: చైనాను దాటేసిన మహారాష్ట్ర

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్‌ కేసులు, మరణాల సంఖ్య పెరిగిపోతోంది. దేశం వ్యాప్తంగా కరోనా కేసుల్లో మొదటి స్థానంలో మహారాష్ట్ర ఉంది. దేశంలోనే కరోనా హాట్‌స్పాట్‌ కేంద్రంగా ఉన్న మహారాష్ట్ర కరోనా కేసుల్లో చైనాను దాటేసింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3వేలకుపైగా కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఇప్పటి వరకూ మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 85,975 కు చేరుకుంది. చైనాలో ఇప్పటి వరకూ కేసుల సంఖ్య 83,036 ఉంది. ఇక రాష్ట్రంలో ఇప్పటి వరకూ 3వేలకుపైగా మరణించారంటే అక్కడ కరోనా ఏ మేరకు విజృంభిస్తుందో అర్థమైపోతుంది.

మరో వైపు తమిళనాడులో కూడా తీవ్ర స్థాయిలో ఉంది. దేశంలో రెండో స్థానంలో ఉంది. ఇప్పటి వరకూ 31,667 పాజిటివ్‌ కేసులు, 1515 మరణాలు సంభవించాయి. అలాగే మూడో స్థానంలో ఢిల్లీ ఉంది. అక్కడ 28వేలకు పైగా కేసులు, 800పైగా మరణాలు సంభవించాయి. ఇక నాలుగో స్థానంలో గుజరాత్‌ ఉంది. అక్కడ 19వేలకుపైగా కేసులు, 1200లకుపైగా మరణాలు చోటు చేసుకున్నాయి. ఇక దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 2.5లక్షలు దాటేసింది. ఇంత కట్టడి చేస్తున్నా.. దేశంలో కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది.

Next Story