మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే శాసన మండలి ఎన్నికలకు నామినేషన్‌ దాఖలు చేశారు. సోమవారం తన కుటుంబ సభ్యులు, పలువురు నేతలతో కలిసి వెళ్లి నామినేషన్‌ దాఖలు చేశారు. మే 21న శాసన మండలి ఎన్నికలు జరగనున్నాయి. రాక్రే ఎన్నిక లాంఛనం కానుంది. ఎలాంటి చట్టసభల నుంచి ప్రాతినిధ్యం లేకపోయినా ఉద్దవ్‌ ఠాక్రే అనూహ్యరీతిలో మహారాష్ట్ర సీఎంగా బాధ్యతలు చేపట్టారు. దీంతో ఆరు నెలల్లో ఏదైనా చట్టసభల నుంచి ప్రాతినిధ్యం పొందాల్సి ఉంది. సమయం దగ్గర పడుతుండటంతో మే 21న జరిగే శాసన మండలి ఎన్నికల్లో ఠాక్రే నామినేషన్‌ దాఖలు చేశారు.

Also Read : దిల్‌రాజ్ పెళ్లి ఫోటోలు

మహారాష్ట్రలో మొత్తం తొమ్మిది స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీ నుంచి నలుగురు, శివసేన, ఎన్సీపీ నుంచి ఇద్దరు చొప్పున, కాంగ్రెస్‌ నుంచి ఒకరు ఎన్నికయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్‌ అధిష్టానం మాత్రం ఇద్దరు పేర్లను ప్రకటించింది. మహావికాస్‌ ఆఘాడీ కూటమిలో శివసేన, ఎన్సీపీతో పాటు కాంగ్రెస్‌ కూడా భాగస్వామిగా ఉంది. అయినప్పటికీ ఇద్దరు అభ్యర్థులను నిలబట్టేందుకు కాంగ్రెస్‌ సిద్ధం కావడంతో శివసేన నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. చివరికి కూటమి నేతలు చర్చలు జరిపిన అనంతరం ఇద్దరు అభ్యర్థులను బరిలోకి దింపే విషయంలో కాంగ్రెస్‌ వెనక్కు తగ్గింది. దీంతో ఠాక్రే ఎన్నికకు అడ్డంకులు తొలగిపోయాయి.

Also Read :ఏపీలో రెండు వేలు దాటిన క‌రోనా కేసులు

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *