ఏపీలో రెండు వేలు దాటిన క‌రోనా కేసులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 May 2020 6:50 AM GMT
ఏపీలో రెండు వేలు దాటిన క‌రోనా కేసులు

ఏపీలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది. రోజు రోజుకు రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు రెండు వేల‌కు పైగా క‌రోనా పాజిటివ్ కేసులు రాష్ట్రంలో న‌మోదు అయ్యాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 7,049 సాంపిల్స్‌ను ప‌రీక్షించ‌గా.. 38 మందికి క‌రోనా పాజిటివ్‌గా వ‌చ్చిన‌ట్లు ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ తాజా బులెటిన్‌లో తెలిపింది. కొత్త‌గా న‌మోదు అయిన కేసుల‌తో క‌లిపి ఇప్ప‌టి వ‌ర‌కు 2018 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కాగా.. 45 మంది మృతి చెందారు. మొత్తం న‌మోదు అయిన కేసుల్లో 998 మంది డిశ్చార్జి కాగా.. 975 మంది ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు.

గత 24 గంటల్లో అనంతపురంలో 8, చిత్తూరులో 9, గుంటూరులో 5, కృష్ణాలో 3, నెల్లూరులో 1 , కర్నూలులో 9, విశాఖపట్నంలో 3 కేసులు నమోదు అయ్యాయి. ఇప్ప‌టి వ‌ర‌కు క‌ర్నూలులో అత్య‌ధికంగా 575 కేసులు న‌మోదు కాగా.. గుంటూరులో 387, కృష్ణాలో 342, చిత్తూరులో 121, అనంత‌పురంలో 115, నెల్లూరులో 102 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి.

38 new corona cases in last 24 hours in AP

Next Story
Share it