వకీల్ సాబ్.. ‘మగువా మగువా’ సాంగ్ ప్రోమో

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్నచిత్రం ‘వకీల్ సాబ్’. తాజాగా ఈ చిత్రం నుంచి ఫస్ట్‌సాంగ్‌ ప్రోమో వచ్చేసింది. ‘మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా.. ‘అంటూ సాగే పాటను సిద్‌ శ్రీరామ్‌ పాడారు. ఈ పాట ప్రొమోను మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ ట్విట్టర్ ద్వారా షేర్ చేశాడు. మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం 10గంటలకు పూర్తి పాటను విడుదల చేయనున్నట్లు తెలిపారు.

పవన్‌ కల్యాణ్‌ చాలా కాలం తరువాత ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర ఫస్టు లుక్‌ పోస్టర్‌ను ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వేసవి కానుకగా మే నెలలో ఈ చిత్రాన్ని ప్రేక్షక్షుల ముందుకు రానుంది.

Vamshi Kumar Thota