అక్కినేని వారసుడు, యువ సామాట్ర్‌ నాగార్జున కుమారుడు అక్కినేని అఖిల్‌ షూటింగ్‌లో గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం అఖిల్‌ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని బొమ్మరిల్లు భాస్కర్‌ తెరకెక్కిస్తున్నారు. ప్రేమకథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అఖిల్‌ సరసన పూజా హెగ్దే నటిస్తోంది.

ఇదిలా ఉండగా.. గత కొన్ని రోజులుగా ఈ చిత్ర షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. అఖిల్‌ పై కొన్ని యాక్షన్‌ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. అయితే చిత్రీకరణ సమయంలో ప్రమాదవశాత్తు అఖిల్‌ గాయపడ్డాడట. అఖిల్ కుడి మోచేతికి గాయమైంది. దీంతో మోచేయి బాగా వాయడంతో.. వారం రోజల పాటు విశాంత్రి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో ఈ చిత్ర షూటింగ్‌ను కొన్ని రోజులు వాయిదా వేశారు. అయితే.. హీరో అఖిల్‌ గానీ, చిత్ర బృందం గానీ దీనిపై ఇప్పటి వరకు స్పందించలేదు.

వేసవి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఇటీవల విడుదలైన మనసా..మనసా.. సాంగ్‌ హృదయాలను కొల్లగొడుతోంది. జీఏ2 పిక్చర్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గోపి సుందర్‌ సంగీతాన్ని అందిస్తుండగా.. బన్నివాసు, వాసు వర్మ లు నిర్మిస్తున్నారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.