బ్రేకింగ్: ఘోర రోడ్డు ప్రమాదం...15 మంది మృతి
By Newsmeter.Network Published on 5 Dec 2019 9:17 AM IST
ముఖ్యాంశాలు
- ఆగివున్న లారీని ఢీకొట్టిన బస్సు
- బస్సు ముందుభాగం నుజ్జు నుజ్జు
- గాయపడ్డ వారిలో కొందరి పరిస్థితి విషమం
మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకంది. రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు, పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా... రోజురోజుకు ప్రమాదాలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లోని రేవాలోరోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మినీ బస్సు -లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో 15 మందిమృతి చెందగా, మరో 20 మంది వరకు గాయపడినట్లు తెలుస్తోంది. ఈ రోజు ఉదయం 6 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రధాన్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు గుధ్ జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీను బలంగా ఢీకొట్టింది. దీంతో బస్సులోని ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. 10 మంది ఘటనా స్థలిలోనే మృతి చెందారు. మరో ఐదురుగు హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధరించారు.
ఈ ప్రమాదంలోబస్సు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. బస్సును వేగంగా నడిపిన డ్రైవర్ ఆగి ఉన్న లారీ గమనించకపోవడంతోనే ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. బస్సులో చిక్కుకున్న బాధితులను బయటకు తీయడానికి పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. చాలా మంది లోపలే చిక్కుకుపోయారు. క్రేన్ సాయంతో బస్సు-లారీని వేరుచేయడానికి ప్రయత్నిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.