బ్రేకింగ్: మధ్యప్రదేశ్ గవర్నర్ మృతి
By సుభాష్
మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టండన్ (85) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. మంగళవారం ఉదయం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు అశుతోష్ టండన్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. తీవ్ర అనారోగ్యానికి గురైన గవర్నర్‌ను వెంటిలేటర్‌పై ఉంచారు. అయినా.. ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో మరణించారు. ఆయన మరణం పట్ల మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. పలువురు నాయకులు ఆయన ఆత్మకి శాంతి కలుగాలని కోరారు.
మొదటి నుంచే క్రమ శిక్షణగల నేతగా గుర్తింపు తెచ్చుకున్న లాల్జీ.. ఉత్తరప్రదేశ్ శాసన సభ నుంచి, శాసన మండలికి పలు పర్యాయాలు ఎన్నికయ్యారు. సంకీర్ణ ప్రభుత్వంలో భాగంగా మయావతి ప్రభుత్వంలో రాష్ట్రమంత్రిగా కూడా సేవలందించారు. ఇక కళ్యాణ్‌సింగ్ ప్రభుత్వంలోనూ కూడా కొనసాగారు. 2009లో లక్నో పార్లమెంట్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. అనంతరం తొలిసారి 2019జూలై 20న మధ్యప్రదేశ్ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. కాగా, నిన్నటితో ఏడాది పూర్తి చేసుకున్న గవర్నర్.. అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు.