మాధవీలత జీవితంలో మిరాకిల్‌..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 Jun 2020 6:35 PM IST
మాధవీలత జీవితంలో మిరాకిల్‌..

'నచ్చావులే' చిత్రంతో హీరోయిన్‌గా తెలుగమ్మాయి మాధవీలత పరిచయం అయ్యింది. సినిమాల్లో కంటే బయటి వివాదాలతోనే ఎక్కువగా ఫేమస్‌ అయ్యింది. సినిమాలకు దూరమైన తరువాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మాధవీలత ఇటీవల బీజేపీలో చేరి రాజకీయాలపై కూడా తనదైన శైలిలో స్పందిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మాధవీలత తాజాగా చేసిన పోస్టు అనుమానాలను రేకెత్తిస్తోంది.

ఆ మధ్య శ్రీరెడ్డి, రాకేష్ మాస్టర్లను టార్గెట్ చేస్తూ మాధవీ లత చేసిన కామెంట్స్ ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి. వారిద్దరూ అమ్మడి మీద కూడా తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో వారికి లీగల్ నోటీసులు పంపిచింది మాధవీలత. కరోనా వ్యాప్తి చెందడం, లిక్కర్‌ షాపులు ఓపెన్‌ చేయడంపైన కామెంట్లు చేసింది. అంతేనా.. లాక్‌డౌన్‌లో పెళ్లిచేసుకున్న సినీ సెలబ్రెటీలపైనా సెటైర్స్‌ వేసింది. 'ముసుగులో పెళ్లిళ్లు ఏంట్రా..? జనాలు చచ్చిపోతున్నారా.. ఆగలేకపోతున్నారా..? ముహూర్తం మళ్లీ రాదా? ఇది పోతే శ్రావణం.. అదీ పోతే మేఘమాసం.. లేకుండా మరో సంవత్సరం తరువాత ముహూర్తం వస్తుంది కదా.. ఏ పెళ్లి పిల్ల దొరకదా.. లేకుంటే పిల్లోడు మారిపోతాడా?'' అంటూ పోస్ట్ పెట్టి విమర్శలకు గురైంది.

తాజాగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పోస్టు పెట్టింది మాధవీలత. 'ఎన్నో నెలల తరువాత చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. కొత్త జీవితం ప్రారంభం అయ్యింది. అద్భుతాలు జరిగాయి. అందుకే నేను ఎప్పుడూ మిరాకిల్స్ ను నమ్ముతాను. చాలా ఆనందంగా ఉంది. త్వరలోనే వివరాలు వెల్లడిస్తాను'' అంటూ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు పెళ్లి ప్రస్తావన తీసుకువస్తున్నారు. కొందరు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారా..? అని అడగగా.. లేదు ఇంకా యాక్టివ్‌గా అవుతున్నాను అని తెలిపింది. అసలు అద్భుతం ఏంటో తెలియాలంటే మరి కొద్ది రోజులు వేట్‌ చేయక తప్పదు.

23

Next Story