Fact Check : చైనా ప్రోడక్ట్స్ బ్యాన్ చేయాలని అన్నందుకు ‘Made in PRC’ ట్యాగ్ ను వాడుతున్నారా.?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  9 Jun 2020 9:11 AM GMT
Fact Check : చైనా ప్రోడక్ట్స్ బ్యాన్ చేయాలని అన్నందుకు ‘Made in PRC’ ట్యాగ్ ను వాడుతున్నారా.?

చైనా-భారత్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన సంగతి తెలిసిందే..! చైనా కు బుద్ధి చెప్పాలంటే వారిని ఆర్థికంగా దెబ్బతీయాలని.. అలా చేయాలంటే చైనా ప్రొడక్ట్స్ ను వాడడం ఆపాలంటూ సోషల్ మీడియాలో పెద్దగా ప్రచారం జరుగుతోంది. టిక్ టాక్ లాంటి చైనీస్ యాప్స్ వాడడం ఆపేయాలంటూ #BoycottChineseProduct అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండింగ్ జరిగింది.

భారతీయులు చైనా ప్రొడక్ట్స్ వాడకూడదని నిర్ణయించుకున్నారని భావిస్తున్నారని.. ఇకపై చైనాలో తయారైన వస్తువులకు ‘Made in China’ నుండి ‘Made in PRC’(పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా) అన్న ట్యాగ్ ఉండబోతోందని పలు పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. “After boycott of Chinese products, Chinese have started using “Made in PRC ” (People’s Republic of China) instead of Made in China. So be careful.” అన్న మెసేజీకి మేడ్ ఇన్ పి.ఆర్.సి. అని ఉన్న ఫోటోను యాడ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు.

పలువురు ట్విట్టర్ లో షేర్ చేశారు.

కొందరు ఫేస్ బుక్ లో అదే ఫోటోను పెట్టి షేర్ చేయడం మొదలు పెట్టారు.

“Be aware just like China Virus mutates the Made in China now just got its new form PRC (People Republic of China). Please share and spread in all possible languages. No China Virus, No Made in China, No Made in PRC or People’s Republic of China".

P1

చైనా వైరస్ వద్దు, చైనాకు చెందిన ప్రొడక్ట్స్ కూడా మనకు వద్దు.. భారత్ కు చెందిన ప్రొడక్ట్స్ ను మాత్రమే వాడదాం.. వీలైనన్ని భాషల్లో ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేద్దాం అని ఫేస్ బుక్ పోస్టులో పెట్టారు.

నిజ నిర్ధారణ:

వైరల్ అవుతున్న ఫోటోలో ఉన్న ప్యాకేజీ సెప్టెంబర్ 2019కి చెందినది. భారత్ లో చైనా ప్రొడక్ట్స్ ను వాడడం ఆపండి అన్న ఉద్యమం మొదలుకాకముందే ఆ ప్రోడక్ట్ పై మేడ్ ఇన్ పి.ఆర్.సి. అన్నది ఉంది.

‘Made in PRC’ అన్న కీ వర్డ్ ను ఉపయోగించి సెర్చ్ చేయగా గత మూడు-నాలుగు సంవత్సరాలుగా ఈ లేబుల్స్ వైరల్ అవుతూ ఉన్నాయి. ఇంతకు ముందు కూడా ఫేస్ బుక్ లో ఇలాంటి పోస్టు 2017లో వైరల్ అయింది. “Be careful! Made in PRC means Made in ‘People’s Republic of China’, Don’t buy!”

పి.ఆర్.సి. అంటే ఏమిటి:

పి.ఆర్.సి. అన్నది చైనా మార్కెటింగ్ టూల్ గా మార్చుకుంది. చైనా తమ దేశంలో తయారవుతున్న ప్రొడక్ట్స్ కు మేడ్ ఇన్ చైనా అని కాకుండా మేడ్ ఇన్ పి.ఆర్.సి. అన్న ట్యాగ్ ను ఉపయోగిస్తోంది. పి.ఆర్.సి. అంటే పీపుల్ రిపబ్లిక్ ఆఫ్ చైనా.. ఇది ఆ దేశం నిజమైన పేరు. మేడ్ ఇన్ చైనా ప్రొడక్ట్స్ కు చెడ్డ పేరు ఉండడం.. పెద్దగా ప్రజలు ఆసక్తి చూపడం లేదని చాలా ప్రొడక్ట్స్ కు మేడ్ ఇన్ పి.ఆర్.సి. అన్న ట్యాగ్ ను తగిలిస్తూ ఉన్నారు.

South China Morning Post న్యూస్ రిపోర్ట్ ప్రకారం 2015లో చైనాకు చెందిన కొన్ని బట్టల కంపెనీలు మేడ్ ఇన్ చైనా అన్న ట్యాగ్ ను తీసేసి మేడ్ ఇన్ పి.ఆర్.సి. అన్న దాన్ని ఉపయోగించడం మొదలుపెట్టారు. జపాన్ మార్కెట్ లో మేడ్ ఇన్ చైనా అని ఉన్న ప్రొడక్ట్స్ ను ఎవరూ తీసుకోకపోవడంతో ఇలా మేడ్ ఇన్ పి.ఆర్.సి. అన్న ట్యాగ్ ను కంపెనీలు పెట్టుకుంటూ ఉన్నాయి. చాలా హార్డ్ వేర్ కంపెనీలు కూడా మేడ్ ఇన్ పి.ఆర్.సి. బాట పట్టి చాలా రోజులే అయింది.

మేడ్ ఇన్ పి.ఆర్.సి. అన్న ట్యాగ్ ముందు నుండి ఉంది. భారత్ లో #BoycottChineseProduct అన్న ఉద్యమం మొదలైనందుకు చైనా కంపెనీలు మేడ్ ఇన్ పి.ఆర్.సి. అన్న ట్యాగ్ ను తగిలిస్తున్నాయన్నదాంట్లో ఎటువంటి నిజం లేదు.

Claim Review:Fact Check : చైనా ప్రోడక్ట్స్ బ్యాన్ చేయాలని అన్నందుకు ‘Made in PRC’ ట్యాగ్ ను వాడుతున్నారా.?
Claim Fact Check:false
Next Story