Fact Check : కాచిగూడ రామకృష్ణ ఆసుపత్రిని సీజ్ చేశారా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  9 Jun 2020 8:21 AM GMT
Fact Check : కాచిగూడ రామకృష్ణ ఆసుపత్రిని సీజ్ చేశారా..?

వాట్సప్ ను వాడుకుంటూ కొందరు కావాలనే వదంతులను ప్రచారం చేస్తూ వస్తున్నారు. కొందరు నిజమేనని నమ్ముతూ ఉన్నారు. తాజాగా హైదరాబాద్ లోని కాచిగూడలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి గురించి వదంతులు సృష్టించడం మొదలుపెట్టారు.

వాట్సప్ లో ఫార్వర్డ్ అవుతున్న మెసేజ్ ప్రకారం కాచిగూడలోని రామకృష్ణ ఆసుపత్రిని అధికారులు మొత్తం సీజ్ చేశారు.. ఆసుపత్రి సిబ్బందికి కరోనా వైరస్ అని సోకడంతో సీజ్ చేశారు అని మెసేజ్ లో చెబుతూ.. ఆసుపత్రి ఫోటోను పెట్టి ఫార్వర్డ్ చేశారు.

K1

“Kachiguda Ramakrishna hospital is sealed…the whole hospital staff is positive,” అని మెసేజీలో ఉంది. దీంతో ఆ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న, తీసుకుంటున్న వాళ్లంతా భయాందోళనలకు గురవుతున్నారు.

నిజ నిర్ధారణ:

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలన్నీ 'పచ్చి అబద్ధం'

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలన్నీ పచ్చి అబద్ధాలు. తమ ఆసుపత్రిలో కరోనా పేషేంట్ ను చేర్చుకోలేదు.. ఎవరూ లేరు కూడా.. ఆసుపత్రి సిబ్బంది ఎవరికీ కూడా కరోనా పాజిటివ్ రాలేదు. ఆసుపత్రి సాధారణ టైమింగ్స్ తోనే పని చేస్తోందని రామ కృష్ణ ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్ హన్మంత్ రావు తెలిపారు.

ఈ వదంతులపై డాక్టర్ హన్మంత్ రావు మాట్లాడిన వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు.

ఆసుపత్రి ముందు వదంతులను నమ్మకండి అంటూ పెట్టిన పోస్టర్ ను కూడా గమనించవచ్చు. ఆసుపత్రి ఉదయం 10 గంటల నుండి 6 గంటల వరకూ పనిచేస్తుందని ఆ పోస్టర్ లో రాసుకుని వచ్చారు.

K2

కరోనా వైరస్ కారణంగా తెలంగాణలో మరణాల సంఖ్య పెరుగుతూ ఉంది. ఆదివారం నాడు 14 మంది చనిపోయినట్లు రిపోర్టులు రాగా.. అందులో హైదరాబాద్ కు చెందిన టీవీ జర్నలిస్టు కూడా మరణించాడు. కరోనా కారణంగా తెలంగాణ లో చనిపోయిన వారి సంఖ్య 137కు చేరింది. కరోనా వ్యాప్తి గణనీయంగా పెరుగుతూ ఉంటే.. మరోవైపు వదంతులు సామాన్యులను కలవరపెడుతూ ఉన్నాయి.

రామకృష్ణ ఆసుపత్రి స్టాఫ్ కు కరోనా పాజిటివ్ వచ్చి ఆసుపత్రిని సీల్ చేశారన్నది పచ్చి అబద్ధం.

Claim Review:Fact Check : కాచిగూడ రామకృష్ణ ఆసుపత్రిని సీజ్ చేశారా..?
Claim Fact Check:false
Next Story