విషాదంలో లతా మంగేష్కర్..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  30 May 2020 9:42 AM GMT
విషాదంలో లతా మంగేష్కర్..

ఆనంద్, రజనీగంధ వంటి చిత్రాలకు పాటలు రాసిన ప్రముఖ గేయరచయిత యోగేష్ గౌర్(77) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న యోగేష్ గౌర్ ముంబైలోని నాలా సపోరాలో ఉంటున్న తన శిష్యుడి ఇంటి వద్దే చికిత్స తీసుకుంటున్నట్లు తెలిసింది. శుక్రవారం రాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు, సన్నిహితులు అధికారికంగా వెల్లడించారు.

యోగేష్ గౌర్ మరణ వార్త విన్న గాయని లతా మంగేష్కర్ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. యోగేష్ జీ రాసిన పాటలు విన్నప్పుడల్లా ఏదో తెలియని అనుభూతి కలిగేదని లతా మంగేష్కర్ అభిప్రాయపడ్డారు. యోగేష్ మరణవార్తతో తాను చాలా విచారంలో ఉన్నానన్నారు. యోగేష్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అలాగే ఆ కవి ఆత్మకు శాంతి చేకూరాలని యోగేష్ ప్రార్థించారు.

Next Story
Share it